(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై వరుస దాడులు కొనసాగుతున్నాయి. విజయనగరం జిల్లా రామతీర్థం ఘటన రచ్చ రచ్చ అవుతోంది. అదే తరుణంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బుద్ధుని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నెల రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ధ్వంసం చేశారు. ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత మంచి నీటి పథకం పక్కనున్న ఉద్యానవనంలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు, తెలుగుతల్లి విగ్రహాలతో పాటు బుద్ధుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం కుడి చేతి భాగాన్ని నెల రోజుల క్రితం దుండగులు ధ్వంసం చేయగా గుర్తించిన అధికారులు శిల్పి సాయంతో కొత్త చేతిని అమర్చారు. అయితే ఆదివారం మరోమారు బుద్ధుని చేయి భాగాన్ని ఎవరో మళ్లీ విరగ్గొట్టినట్లు తెలుస్తోంది. సోమవారం దీనిని గుర్తించిన అధికారులు ఆకతాయిల పనిగా భావిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పార్కును పర్యవేక్షిస్తున్న గ్రామీణ నీటి సరఫరా విభాగం డీఈ రాజు తెలిపారు.
Also Read: సోము వీర్రాజు అరెస్టు.. రామతీర్థ ధర్మయాత్ర ఉద్రిక్తం