ప్రముఖ హాలీవుడ్ టీవీ అండ్ సినిమా నటీమణి తన్యా రోబర్ట్స్ కన్నుమూశారు. క్రిస్మస్ ఈవ్ సందర్బంగా తన్యా ఇంగ్లండ్ లోని తన ఇంటివద్ద పెంపుడు కుక్కలతో వాకింగ్ చేస్తుండగా.. హఠాత్తుగా కుప్ప కూలిపోయారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. వెంటిలేటర్స్ మీద ఆమెకు చికిత్స అందిస్తుండగా.. తుది శ్వాస విడిచారు. 1981 లో చార్లెస్ ఏంజెల్స్ అనే టీవీ సిరీస్ తో మంచి పాప్యులారిటీ తెచ్చుకున్నారు తన్యా రాబర్ట్స్. అలాగే.. ఆమె నటించిన మరో టీవీ షో 81 ఎపిసోడ్స్ తో రికార్డు సృష్టించారు.
ఇక తన్యా.. 1985 లో జేమ్స్ బాండ్ సినిమా ‘ఏ వ్యూ టు ఏ కిల్’ లో రోగర్ మూరే సరసన కథానాయికగా నటించి మెప్పించారు. ఇంకా టూరిస్ట్ ట్రాప్, ది బీస్ట్ మాస్టర్ లాంటి సినిమాల్లోనూ తనదైన బాణీలో నటించి అప్పటి ప్రేక్షకుల్ని అలరించారు. తాన్యాకి భర్త , చెల్లెలు ఉన్నారు. ఆమె మృతికి పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.