మహారాష్ట్రలో శుక్రవారం రాత్రి నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కూలి ఏడుగురు మృతి చెందారు.మరి కొందరు శిథిలాల కింద ఉన్నట్లు భావిస్తున్నారు.మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాస్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నెహ్రూ చౌక్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.భవనంలోని ఐదవ ఫ్లోర్ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అందులో పనిచేస్తున్న వారు శిథిలాల్లో చిక్కుకున్నారు.ఉల్హాస్నగర్ ఫైర్ బ్రిగేడ్,నేషనల్ డిజాస్టర్ టీమ్ వెంటనే అక్కడ చేరుకుని శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసినప్పటికీ అప్పటికే ఏడుగురు మృతి చెందారు.ఇంకా కొందమంది శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.వారిని వెలికి తీసే చర్యలు సాగుతున్నాయి.నెల రోజుల్లో ఉల్హాస్‌నగర్‌లో భవనం స్లాబ్ కూలడం ఇది రెండో సంఘటన.
Must Read ;- మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం.. 13 మంది రోగులు సజీవ దహనం