కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హాస్పిటళ్లలో తరచు అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మహారాష్ట్ర లో మళ్లీ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాల్ఘర్ జిల్లా వసాయ్ వీరార్ పరిధిలోని ఓ కొవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరగడంతో 13 మంది కరోనా బాధితులు సజీవదహనమయ్యారు. అనేక మంది గాయపడ్డారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశముంది. చాలామంది గాయాలపాలయ్యారు. పోలీసులు, రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమించి రోగులను, ఇతర హాస్పటిళ్లకు తరలించారు.
Must Read ;- ప్రాణవాయువు లేక ఊపిరి పోతోంది.. ఆక్సిజన్ అందక ఆసుపత్రిలో 25 మంది మృతి