తాజాగా మహారాష్ట్రలోని థానేలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ప్రమాదం తెల్లవారుజామున జరగడం, సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో నలుగురు రోగులు మరణించారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేశారు. ప్రైమ్ క్రిటికేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్, ఇతర బాధితులను మరో ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు అయిదు లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించనున్నారు. వరుసగా ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంలో, ఆస్పత్రుల యజమాన్యాలు ఫైర్ సేఫ్టీని పక్కగా అమలు చేయాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.
Must Read ;- తెలంగాణలో 7 వేలు దాటిన కేసులు : కేసీఆర్ కీలక ఆదేశాలు