టీడీపీ పోలిట్బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పై జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, మంత్రి వెల్లంపల్లి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. స్థానిక పోలీసులు నిరసన ర్యాలీ, దిష్టిబొమ్మ దగ్ధాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ టీడీపీ శ్రేణులు బేఖాతరు చేయడంతో విజయనగరం పోలీసులు కేసు నమోదు చేసినట్లు, అందులో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి పూసపాటి అదితి గజపతిరాజుతో పాటు కొంతమందిని నిందితులుగా చేర్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఏ క్షణానైనా నిందితులను పోలీసు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల ముంగిట్లో ‘పరాక్రమ్’ ప్రదర్శన!
సుభాష్ చంద్రబోస్ 125వ జయంత్యుత్సవాలను పురస్కరించుకొని కోల్‌కతా మెమోరియల్ హాల్‌లో జరిగిన సమావేశానికి...