నిరసన దీక్షకు పిలుపునిచ్చిన జేసీ బ్రదర్స్. రాజకీయాలకు అతీతంగా నిరసన దీక్ష చేపడతామని తెలియజేసిన బ్రదర్స్. నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తాడిపత్రిలో భారీగా పోలీసుల మోహరింపు. జేసీ బ్రదర్స్‌ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. అరెస్ట్ చేసినా దీక్ష కొనసాగిస్తామని తెలియజేశారు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోదంటూ ఆరోపిస్తున్న జేసీ బ్రదర్స్. పోలీసులను కూడా నిందించడానికి లేదని.. వారు కూడా ప్రభుత్వం చెప్పినట్టు మాత్రమే నడుచుకుంటున్నారని చెప్పారు.
నిందితులను శిక్షించాల్సిన పోలీసులే ప్రభుత్వ ప్రతినిధుల్లా పనిచేస్తున్నారని జేసీ ప్రభాకర రెడ్డి ఆరోపించారు. తాడిపత్రిలో ఇంటి నుండి బయటకు రాకుండా వారిని పోలీసులు ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు.
Also Read: 5 అరెస్టులు సరే.. అసలు వాళ్ల సంగతేంటి?