చంద్రబాబుకు మాంచి గిఫ్ట్ ఇవ్వాలని మైండ్ గేమ్ తో ప్రారంభించిన అరెస్ట్ ల ఆటకు సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వ్యూహాలు.. తెలంగాణ నుంచి ఎత్తులు.., ఏపీలో అక్రమ కేసులను నిశితంగా పరిశీలిస్తున్న తెలుగుదేశం అధినేత.. జైలు నుంచే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి.. ఫై ఎత్తుగా తెలంగాణ ఎన్నికల బరిలో ప్రయోగించేందుకు శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. ఉద్యమాల ద్రోహిగా ముద్ర వేసుకుని తెలంగాణలో పాలన పగ్గాలు చేజిక్కించకున్న నేత ఒకరైతే.., వారసత్వ రక్తంతో ఫోటోపై గెలిచిన ఏపీ ఆర్ధిక ఉగ్రవాది మరోకరు కలిసి ఆడిన మైండ్ గేమ్ కు బాబు రచించే మాస్టర్ ప్లాన్ కు దిమ్మతిరిగి పోవాల్సిందేని విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణలో ఎన్నికల బరిలో ఈ సారి మేము కూడా ఉన్నామని చెప్పి చెప్పగానే చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదు చేసి కటకటలా పాలు చేశారు. పీటీ వారెంట్ పిటిషన్లు వేసి..సంబంధం లేని కేసుల్లో చంద్రబాబు,లోకేష్, ఇతర పార్టీ సీనియర్లును అరెస్ట్ చేయాలని కుట్రలు పన్నుతున్నారు. కానీ .. వారి కుట్రలకు ప్రతివ్యూహ రచనతో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో పోటీకి అభ్యర్ధులను సిద్ధం చేస్తోంది. మరోవైపు జనసేన కూడా 32 మంది అభ్యర్ధులను ప్రకటించే దిశగా అడుగులు వేస్తోంది. అందుకు తగ్గ గ్రౌండ్ ప్రిపేర్ కు శ్రేణులను సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు. జైలు నలుగు గోడల మధ్యనుంచే చతురంగ బలగాలను రంగంలో దించి.. ముందు కేసీఆర్ ను అష్టదిగ్బంధం చేయాలని చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నారు. మరోవైపు ఏపీ సెటిలర్స్ తో కూడా ఇప్పటికే తెలుగు దేశం పార్టీ ముఖ్యనేతలు టచ్ వెళ్లి.. ఎన్నిలకల్లో పూర్తి మద్దతునివ్వాలని కోరుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి,హైదరాబాద్ మెట్రో, తదితర జిల్లాలో పార్టీ శ్రేణులను సమాయక్తం చేసేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు జైలు నుంచే దిశానిర్ధేశం చేస్తున్నారు. అయితే తెలుగుదేశం, జనసేన పొత్తుతో తెలంగాణలో కూడా ముందుకు వెళ్తారా..? లేక విడివిడిగా బరిలో దిగుతారా..? అన్నది దానికి ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు అభ్యర్ధుల ఫైనల్ లిస్ట్ ను సిద్ధం చేసేందుకు తెలంగాణ శ్రేణులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. కేసీఆర్.., జగన్ ఆడుతున్న అరెస్ట్ ల మైండ్ గేమ్స్ కు జైలు నుంచే చంద్రబాబు మాస్టర్ ప్లాన్స్ సిద్ధం చేస్తున్నారని సోషల్ మీడియా విశ్లేషణలు ఇప్పటికే ఊపందుకున్నాయి.