అధికారం పోయిందన్న అక్కసుతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అసాంఘీక శక్తులకు మద్దతివ్వడమే కాకుండా తాము కూడా వారికి ఏం తక్కువ కాదన్న రీతిలో రెచ్చిపోతున్నారు. పోలీసులను సైతం బెదిరిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్‌తో మొదలు ఆ పార్టీ నేతలందరిదీ ఇదే వరుస. పైగా పోలీసులను బెదిరిస్తున్న వీడియోలను సోషల్‌మీడియాలో వైరల్ చేయించుకుని హీరోయిజంలా ఫీల్ అవుతున్నారు.
తాజాగా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పొదిలి పోలీస్ స్టేషన్‌లో హంగామా చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించారు జగన్. దీంతో ఆయన జిల్లాలో మిగతా వైసీపీ నేతలను కాదని హల్‌చల్ చేస్తున్నారు. తాజాగా జగన్ పొదిలి పర్యటనలో మహిళలపై దాడి చేసిన వైసీపీ నేతల పరామర్శ కోసం చెవిరెడ్డి పొదిలి వెళ్లారు. వరుసగా మూడు రోజులు ప్రెస్‌మీట్ పెట్టి పెద్ద ఎత్తున డబ్బులు పట్టుకున్నారని అవన్నీ తనవి కావని ..తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఏడుపందుకున్న చెవిరెడ్డి తాజాగా అధికారులను బెదిరిస్తున్నారు.
వైఎస్ ఉన్నప్పుడు తన భార్యతో వైఎస్ పథకాలపై పీహెచ్‌డీ చేయించి..ఆయన అభిమానాన్ని చూరగొన్నాడు చెవిరెడ్డి. ఒకప్పుడు కనీస ఆదాయం ఉండని ఆయన ఇప్పుడు వేల కోట్లకు పడగలెత్తారు. ఇంత చేసినా తనను ఎవరూ పట్టుకోలేకపోతున్నారని ధైర్యం ఏమో కానీ బెదిరింపులకు మాత్రం తగ్గడంలేదు. ఎన్నికల సమయంలో ఓ పోలింగ్ ఆఫీసర్ని బెదిరించి దొరికిపోయారు. అయినా ఆయనను జైలుకు పంపకపోవడంతో..తనకు ఎదురు లేదని చెవిరెడ్డి రెచ్చిపోతున్నారు. ఇక ఉత్తరాంధ్రలో సీదిరి అప్పలరాజు సైతం ఇదే రీతిలో రెచ్చిపోతున్నాయి. ఐనా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా. పార్టీ అధినేత జగన్ దారిలోనే వైసీపీ నేతలు కూడా నడుస్తున్నారు.