తల్లికి వందనం పథకం విషయంలో తనపై వైసీపీ చేసిన ఆరోపణలపై లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆరోపణలు నిరూపించేందుకు 24 గంటల డెడ్‌లైన్ కూడా పెట్టారు లోకేష్. అంతేకాదు..ఆరోపణలు నిరూపించకపోతే న్యాయపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైసీపీకి వార్నింగ్ ఇఛ్చారు. ఐతే ఇప్పుడు డెడ్‌లైన్ ముగిసింది. ఈ నేపథ్యంలోనే లోకేష్ మరోసారి వైసీపీకి హెచ్చరికలు పంపారు. ఇక నుంచి బురద చల్లేసి దాక్కుంటానంటే నడవదంటూ ట్వీట్ చేశారు. సవాల్ చేస్తే వైసీపీ నేతల సౌండ్ ఆఫ్ అయిందన్నారు లోకేష్. ఇక, ఇంత కాలం టీడీపీపైనా ఫేక్ వార్తలను పెద్దగా పట్టించుకోకపోయినా..ఇప్పుడు నారా లోకేష్ మాత్రం ఇది రాజకీయమే అని అనుకోవడానికి సిద్ధంగా లేరు. తప్పుడు ఆరోపణలు, ప్రచారాలకు తనదైన పద్ధతిలో చెక్‌పెట్టబోతున్నారు.
తల్లికి వందనం స్కీమ్‌లో రూ. రెండు వేలు లోకేష్ ఖాతాలోకి వెళ్తున్నాయని వైసీపీ ఆరోపించింది. ఐతే ఈ ఆరోపణలను నారా లోకేష్ సీరియస్ గా తీసుకున్నారు. వైసీపీకి 24 గంటలు డెడ్ లైన్ పెట్టారు. ఆధారాలు చూపిస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. గతంలోనూ వైసీపీ ఫేక్ ఆరోపణలు చేసినప్పుడు నారా లోకేష్ సవాల్ చేశారు. కానీ అప్పుడు కూడా వైసీపీ ఏ ఆధారాలు సమర్పించలేకపోయింది. ఇప్పుడు మళ్లీ అదే వ్యూహం పాటిస్తోంది. దాంతో నారా లోకేష్ ఇక చట్టపరమైన చర్యలకు సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ సారి తల్లికి వందనం స్కీమ్‌పై చేసిన ఆరోపణలకు వైసీపీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జగన్ రెడ్డి జే ట్యాక్స్ వసూలు చేశారని టీడీపీ నేతలు ఆధారాలతో ఆరోపణలు చేసేవారు. లిక్కర్ స్కాం నుంచి ఇసుక వరకూ ..ఆయన బంధువులు ఎలా దోపిడీ చేసేవారో వివరించేవారు. కానీ నారా లోకేష్‌పై L-ట్యాక్స్ అని..పథకంలో రెండు వేలు తీసుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కనీసం ఓ ఆధారం చూపించినా లాజికల్‌గా ఉంటుంది. కానీ అలా ఆధారాలేం చూపించకుండానే బట్ట కాల్చి మీదేస్తున్నారు.
దీంతో వైసీపీ బురదజల్లుడు రాజకీయానికి బ్రేక్ వేయాలని లోకేష్ నిర్ణయించారు.
నారా లోకేష్ ..తప్పుడు ప్రచారాలు చేసే వారిపై ఇప్పటికే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. తల్లికి వందనం విషయంలో తనపై ఆరోపణలు చేసిన వారిని న్యాయపరంగానే ఎదుర్కొవాలని లోకేష్ రెడీ అయ్యారు. ఇప్పటివరకూ వైసీపీ నేతలు ఎలాంటి ఆధారాలు బయటపెట్టలేదని, కనీసం క్షమాపణ కూడా కోరలేదన్నారు. దీంతో లీగల్ యాక్షన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు.