వైసీపీ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తప్పుడు కేసులు బనాయిస్తూ.. ప్రతి పక్ష నాయకులను వేధించడానికే అధికారంలోకి వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్. బి సింగవరంలో ఎన్నికల ప్రచారంలో చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రచారం సమయంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య వివాదం చెలరేగింది. వివాదంలో వైసీపీ శ్రేణులపై చింతమనేని దాడి చేశారనీ ఆరోపిస్తున్నారు.
కానీ, అసలు ఈ కేసుతో చింతమనేని సంబంధం లేదని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అక్రమ కేసు బనాయించి కావాలనే చింతమనేనిని అరెస్ట్ చేశారని . అధికార పార్టీ ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని చెప్తున్నారు.
చింతమనేని అక్రమ అరెస్ట్‌తో ఆయన బాధ్యతలను సతీమణి చింతమనేని రాధమ్మ చేపట్టారు. ఆమె స్థానిక ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
Must Read ;- కక్షగట్టి జైలుకు పంపారు.. రిజల్ట్ తో షాక్ తిన్నారు!!