July 8, 2026 10:03 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కక్షగట్టి జైలుకు పంపారు.. రిజల్ట్ తో షాక్ తిన్నారు!!

తమ బెదిరింపులను ధిక్కరించే వారిపై కక్ష కట్టడం అధికార పార్టీ అండతో చెలరేగే వారికి మామూలే. కానీ.. ఫలితం పరాజయం అయినప్పుడు.. వారు బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది.

February 15, 2021 at 8:49 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పీలేరు సబ్ జైలు నుంచి పోలీసు ఎస్కార్టుతో శివప్రసాద్ నాయుడు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడం కోసం నవాబు పేటకు వచ్చినప్పుడు బహుశా.. పోలింగ్ కేంద్రం దగ్గరున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు విలాసంగా నవ్వుకుని ఉంటారు. మేం చెప్పిన మాట వినలేదు.. మా డీల్ కు నువ్వు ఒప్పుకోలేదు.. చూశావా జైల్లో ఉన్నావ్.. జైలు నుంచి పోలీసుల పహరాలో ఓటేయడానికి వచ్చావ్.. అంటూ హేళనగా, కక్షగా నవ్వి ఉంటారు.

కానీ.. వారి నవ్వులు ఎంతో కాలం నిలవలేదు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి వారి మొహాలు మాడిపోయాయి. సిగ్గుతో మొహం చాటేసుకోవాల్సిన దుస్థితి వారిది. ఏమిటిది? ఎందుకిలా జరిగింది. వాళ్లు హేళనగా, కక్షగా ఎందుకు నవ్వారు? ఎందుకు మొహం చాటేసుకోవాలనుకున్నారు.. తెలియాలంటే.. వివరాల్లోకి వెళ్లాల్సిందే.

ఇంతకూ సదరు గుర్రం శిప్రసాద్ నాయుడుకు వైఎస్సార్ సీపీ వాళ్లు ప్రపోజ్ చేసిన డీల్ ఏంటి? ఆయనే ఆ నవాబుపేట పంచాయతీలో తెలుగుదేశం తరఫున సర్పంచి అభ్యర్థి. ఆయనను పోటీనుంచి తప్పుకోమని వారు అడిగారు. ఒత్తిడి చేశారు. బెదిరించారు. నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత కూడా వారి బెదిరింపులు ఆగలేదు. నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాల్సిందిగా బెదిరించారు. అయితే గుర్రం శివప్రసాద్ నాయుడు మాత్రం వెనక్కు తగ్గలేదు. వారి ఒత్తిళ్లకు లొంగలేదు.

శనివారం సర్పంచి ఎన్నిక జరగాల్సి ఉండగా గురువారం రాత్రి- అతణ్ని అరెస్టు చేశారు. మద్యం అక్రమంగా తరలిస్తున్నారంటూ.. శివప్రసాద్ నాయుడుతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసి జైలుకు పంపారు. దాని పర్యవసానమే.. సర్పంచి అభ్యర్థి పోలీసు ఎస్కార్టుతో జైలు నుంచి వచ్చి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా వారి పంతం నెగ్గించుకున్నారు.

కానీ.. నవాబుపేట ప్రజలు మాత్రం.. తెలుగుదేశం అభ్యర్థి వెంటే ఉన్నారు. గుర్రం శివప్రసాద్ నాయుడు ఎన్నికలకు ముందు రోజున కనీసం నలుగురిని కలిసి ఓట్లు అడగడానికి కూడా అందుబాటులో లేకపోయినా.. ఆయనకు మద్దతుగా నిలిచారు. ఫలితాలు వెలువడే సరికి.. శివప్రసాద్ ఏకంగా 56 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చిన్న పంచాయతీలో అదృష్టవశాత్తూ దక్కిందని అనుకోగల చిన్న మెజారిటీ కాదు ఇది. గెలిచే అభ్యర్థిని బెదిరించి, కక్షపూరితంగా వ్యవహరించిన వైఎస్సార్సీపీ నాయకులకు బుద్ధి వచ్చేలా చేసే మంచి మెజారిటీ.

ఓడిపోయే సీటు కోసం ఎందుకింత కంగారుపడ్డారో..?

ఏకంగా అభ్యర్థిని జైలుకు పంపించినా కూడా.. 56 ఓట్ల మెజారిటీతో పంచాయతీని గెలవడం అంటే అతను చాలా గట్టి అభ్యర్థికింద లెక్క. తెలుగుదేశం పార్టీకి అక్కడ అనల్పమైన ప్రజాదరణ ఉన్నట్టు లెక్క. అయినా సరే.. ఓడిపోయే సీటుకోసం వైకాపా నాయకులు ఎందుకింత ఆరాటపడ్డట్టు? నామినేషన్ విత్ డ్రా కోసం బెదిరించి, తర్వాత కేసులు బనాయించి.. ఎందుకిలా అభాసుపాలు అయినట్టు? ఈ ఆలోచన ఎవరికైనా కలుగుతుంది.

ఓడిపోయే సీట్లలో కూడా.. అంటే తమకు ఏమాత్రం బలం లేని పల్లెల్లో కూడా పంతం నెగ్గించుకోవాలనే వైఖరి వైకాపా నాయకుల్లో ఈ దఫా చాలా చోట్ల కనిపించింది. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత గ్రామంలోనే ఏకగ్రీవం కావాల్సిన పంచాయతీని ఎన్నికకు తీసుకువెళ్లి.. అచ్చెన్నాయుడు అరెస్టు చేయించి.. రకరకాల మాయోపాయాలు పన్నిన అధికార పార్టీ.. చివరికి సాధించింది సున్నా. చిత్తూరు జిల్లా నవాబు పేటలో కూడా అదే జరిగింది.

ఇక్కడ ఏకంగా అభ్యర్థినే అరెస్టు చేయించారు. మద్యం అక్రమ తరలింపు కేసులు బనాయింపజేశారు. అభ్యర్థి జైల్లో ఉన్నా.. తెలుగుదేశం నాయకులు పూనుకుని ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఆయన వెంట నిలిచారు. గెలిపించారు.

పట్టుదలకు కారణముంది!

నవాబు పేట పంచాయతీ కలకడ మండలం కిందికి వస్తుంది. కలకడ అనేది.. పీలేరు నియోజకవర్గం కిందికి వస్తుంది. అంటే ఇదంతా చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సామ్రాజ్యం. ఎన్నికల పర్వం మొదలైన తర్వాత కూడా.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి.. నానా మాటలు తిడుతూ.. వివాదాస్పదంగా మారిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదివరకు పీలేరు ఎమ్మెల్యేనే. ఇప్పుడు మారిన సమీకరణల నేపథ్యంలో పుంగనూరు నుంచి నెగ్గుతున్నారు. కానీ.. పీలేరు మీద కూడా పట్టు కోరుకుంటూనే ఉంటారు. పీలేరులో ఉన్న ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి కూడా వైకాపాకు చెందిన వాడే. ఎవరికి వారు పట్టు నిలుపుకునే ప్రయాసలో ఏకగ్రీవం చేయించుకోవాలనుకున్నారు. పోటీ తప్పకపోయేసరికి శివప్రసాద్ ను జైలుకు పంపారు. కానీ.. ప్రజలు అతడికే విజయం కట్టబెట్టే సరికి ఖంగుతిన్నారు. అదీ సంగతి!!

ట్వీట్‌లో లోకేష్ ఎద్దేవా

‘‘ఎంతటి నియంత అయినా ప్రజాస్వామ్యం ముందు తలవంచాల్సిందే. అక్రమ కేసులతో వేధించారు, నామినేషన్ విత్ డ్రా చేసుకోమని ఒత్తిడి చేసారు. అయినా లొంగకపోయే సరికి తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసారు. కానీ విజయాన్ని ఆపలేకపోయారు.’’ అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు.

‘‘అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త సత్తా. ధైర్యంగా నిలబడి చిత్తూరు జిల్లా కలకడ మండలం నవాబ్ పేట పంచాయతీ సర్పంచ్ గా గెలిచి మీసం మెలేసిన శివప్రసాద్ నాయుడుని అభినందిస్తున్నాను.’’ అంటూ లోకేష్ సర్పంచిగా గెలిచిన శివప్రసాద్ నాయుడును ట్విటర్లో అభినందించారు.

Must Read ;- కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: లోకేశ్

ఎంతటి నియంత అయినా ప్రజాస్వామ్యం ముందు తలవంచాల్సిందే. అక్రమ కేసులతో వేధించారు, నామినేషన్ విత్ డ్రా చేసుకోమని ఒత్తిడి చేసారు. అయినా లొంగకపోయే సరికి తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసారు. కానీ విజయాన్ని ఆపలేకపోయారు. pic.twitter.com/1aeUywH3wF

— Lokesh Nara (@naralokesh) February 14, 2021

Tags: AP panchayat electionsAP panchayat elections 2021AP panchayat elections election code newsap political news todayAP TDP leaderschandrababuchandrababu tweetLatest political news indialeotoppanchayat electionpanchayat elections apPolitical news telugutdptdp candidatetdp partytdp sarpanchtdp sarpanch wintdp sarpanch wontdp updates today
Previous Post

వెబ్ సిరీస్ గా ‘బిగ్ బాస్ 4’ లవ్ స్టోరీ

Next Post

ఏపీలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు

Related Posts

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

సెక్స్ పర్వర్ట్ భర్తల్లో వీడు.. నెంబర్ వన్!

తానా సభలో వైసీపీ హడావిడి.. తన్నులు తిని బయటకు వచ్చి రచ్చ…!

యువగళంలో నవశకం, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. లోకేష్‌ హామీ..!!

Lavanya Tripathi

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

దేశంలో వ్యాపిస్తున్న మరో భయంకరమైన వ్యాధి.. ‘మ్యుకోర్మికోసిస్’

క్విడ్ ప్రో కో నేటికీ కొనసాగిస్తున్న జగన్ : సబ్బం హరి

ముఖ్య కథనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist