‘ఇదేంటి! ఆహ్వాన పత్రికలు అందించి పెళ్లికి రావద్దంటున్నారు’ అని ఆశ్చర్యపోతున్నారా? ఈ మాత్రం సంబడానికి అసలు పత్రికలు ఎందుకో? అనుకుంటున్నారా? అయితే.. ముందుగా విషయం తెలుసుకోండి. ఎందుకంటే.. ఈ పత్రికలు ముద్రించింది ఏ సాధారణ వ్యక్తో కాదు. తెలుగుదేశం పార్టీ ప్రముఖ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఆయన తన కుమార్తెకు పెళ్లి నిశ్చయించారు.
అదేంటి..! ఊళ్లో ఎవరు పిల్చినా.. కార్యానికి కాకితో కబురంపితే కారెక్కి వచ్చి దిగిపోయే చింతమనేని.. తన కుమార్తె పెళ్లికి ఎవరినీ రావద్దనడమేమిటి? అనుకుంటున్నారా! అవునండీ.. ఇది నిజం. కరోనా కాలంలో విజ్ఞత కలిగిన వ్యక్తిగా.. తన బాధ్యతాయుతమైన ప్రవర్తనకు ఇది నిదర్శనం. ఇంట్లో గేదె ఈనినా.. భారీగా జనాన్ని సమీకరించి హంగామా చేస్తున్న అధికార పార్టీ నాయకులకు కళ్లు తెరిపించేలా చేశారు చింతమనేని ప్రభాకర్. అయినా.. కుమార్తె పెళ్లి. ఎవరికీ చెప్పకుండా చేయలేరు. అందుకే.. ఆహ్వాన పత్రికలు ప్రచురించారు. అదీ.. విలక్షణంగా. తన కుమార్తె పెళ్లి విషయాన్ని తెలియజేస్తూ.. అందరి ఆశీస్సులూ అడిగారు. మనస్ఫూర్తిగా మీ ఇంటి నుంచే ఆశీర్వదించండి అని వేడుకున్నారు. కరోనా నిబంధనల దృష్ట్యా.. దయచేసి ఎవరూ పెళ్లికి రావద్దని విన్నవించుకున్నారు. ఇలా.. బాధ్యత కలిగిన ఒక నాయకుడిగానే కాదు.. ఓ కుటుంబ పెద్దగానూ తన విలక్షణతను చాటుకున్నారు. శభాష్ చింతమనేని.
Must Read ;- నో పెళ్లి పాట అంటే అమ్మకు కోపం!











