టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలోని పంచాయతీ ఎన్నికలపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ప్రత్యేక దృష్టి పెట్డడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని ఇప్పటికే రెండు సార్లు లేఖలు రాయడమే గాక కుప్పంలోని 41 సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్ఈసీని చంద్రబాబు కోరారు. స్థానికేతరులను కుప్పం నుంచి పంపేయాలని డిమాండ్ చేయడంతో పాటు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రికార్డ్ చేయాలని ఎస్ఈసీని చంద్రబాబు కోరారు. ఎన్నికల నిర్వహణకు అదనపు భద్రతా బలగాలను ఏర్పాటు చేయాలన్నారు. మరో వైపు స్థానికేతరుడైన చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కుప్పంలో పర్యటించడంపై ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ఫోన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Must Read ;- మంత్రి పెద్దిరెడ్డి బరితెగింపునకు పరాకాష్ట