ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు అందింది. సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారంటూ లీగల్ రైట్స్ అడ్వైజరీ కన్వీనర్ ఎన్ఐ జోషి ఫిర్యాదు చేశారు. ఎస్సీ మాల పేరుతో రిజర్వేషన్ పొంది క్రిస్టియన్‌గా మతం మార్చుకున్న సునీల్‌కుమార్‌ను సర్వీస్ నుంచి తప్పించాలన్నారు. మతం మార్చుకున్నవాళ్లు రిజర్వేషన్‌ను వదలుకోవాలన్న మద్రాస్ హైకోర్టు తీర్పు మేరకు సునీల్‌కుమార్‌ను సర్వీస్ నుంచి తొలగించాలని కోరారు. అంబేద్కర్ మిషన్ పేరుతో హిందూ వ్యతిరేక భావాలను సునీల్ ప్రోత్సహించారని, సునీల్‌కుమార్‌పై సెక్షన్ 153(ఏ), 295(ఏ) కింద ఎఫ్ఐఆర్ సమోదు చేయాలన్నారు. హోంశాఖ వెంటనే స్పందించి, పూర్తిస్థాయి దర్యాప్తు ఎన్ఐ జోషి డిమాండ్ చేశారు. ఒక ఉన్నత పదవిలో ఉంటూ.. సర్వీస్ రూల్స్ అతిక్రమించడంతో ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Must Read ;- సీఐడీ అదనపు డీజీకి కోర్టు దిక్కరణ నోటీసులు











