యాంగ్రీ మేన్ రాజశేఖర్.. ‘గరుడవేగ’తో మంచి హిట్టందుకొని.. ఆ వెంటనే ‘కల్కి’ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ.. ఆయన ప్రస్తుతం తదుపరి చిత్రాల్ని సెట్స్ మీదకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రాజశేఖర్.. రెండు మూడు సినిమాల్ని లైన్ లో పెట్టుకున్నారు. అందులో ముందుగా సెట్స్ మీదకు వెళ్ళబోయే సినిమా ‘శేఖర్’. ‘జోసెఫ్’ మలయాళ సినిమాకి ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే.
మలయాళ విలక్షణ నటుడు జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మెడికల్ స్కామ్ ఆధారంగా రూపొందిన ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఇందులో కథానాయకుడు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. అయినప్పటికీ పోలీస్ డిపార్ట్ మెంట్ అతడి తెలివి తేటల్ని, షార్ప్ నెస్ ను నమ్ముతుంటుంది. పోలీసులు తమకి అంతుబట్టని కాంప్లికేటెడ్ కేసెస్ ను అతడికి అప్పగిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఒక బిగ్గెస్ట్ స్కామ్ లాంటి కేసును అతడు టేకప్ చేస్తాడు. ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ సినిమా మాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం రేపింది.
ఇప్పుడు ఇదే కథను పెద్దగా మార్పులేమి చేయకుండా.. రాజశేఖర్ తో ‘శేఖర్’ అనే టైటిల్ లో రూపొందిస్తున్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్ లో ముడతలు పడిన ముఖంతో రాజశేఖర్ రివీలైన.. ‘శేఖర్’ పోస్టర్ ను ఆ మధ్య ఎప్పుడో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో రాజశేఖర్ భార్య పాత్ర కోసం మలయాళ ముగ్ధ మోహన కథానాయిక అనూసితార నటిస్తూండడం విశేషంగా మారింది. అలాగే ఇందులో ఆయన కూతురిగా జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్ ను ఎంపిక చేశారని సమాచారం. యం.ఎల్వీ సత్యనారాయణ తో కలిసి రాజశేఖర్ కూతుళ్ళు శివాత్మిక, శివానీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. లలిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా తెలుగులోనూ మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు మేకర్స్.
Must Read ;- డా.రాజశేఖర్, వెంకటేశ్ మహా కలయికలో ‘మర్మాణువు’