కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ రాజకీయ పార్టీల ర్యాలీలకు, సభలకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సెకండ్ వేవ్ విజృంభణకు ఎన్నికల సంఘానిదే బాధ్యత అని, దీనికి ఎన్నికల అధికారులపై హత్య కేసు నమోదు చేయాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓట్ల లెక్కింపు సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఓ ప్రజాప్రతినిధి చేసిన వినతిపై హైకోర్టు ఈ విధంగా ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టింది. ఎన్నికల ప్రచారంలో కరోనా ఆంక్షల అమలులో ఈసీ పూర్తిగా విఫలమయ్యిందని పేర్కొంది. కోవిడ్ నిబంధనలు పాటించేలా ఎన్నికల సంఘం ప్రణాళికలు అమలు చేయకపోతే మే 2న ఓట్ల లెక్కింపును నిలిపి వేస్తామని హెచ్చరించింది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శితో కలిసి కౌంటింగ్ రోజు కరోనా వ్యాపించకుండా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించింది.
Must Read ;- ఏపీలో పది,ఇంటర్ పరీక్షల నిర్వహణపై జోక్యం చేసుకోండి.. గవర్నర్‌కు లోకేశ్ లేఖ











