ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని ఒక్క రోజు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. జేసీని పోలీసులు ఇవ్వాళ విచారిస్తారు. జేసీ తరుపు న్యాయవాది సమక్షంలో ప్రశ్నించేందుకు పోలీసులు కోర్టు నుండి అనుమతిని తీసుకున్నారు.
కొద్దిరోజుల క్రితం దళిత సీఐ దేవేంద్రను దూషించినందుకు గాను తాడిపత్రి పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో జేసీని విచారిస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉందని ముందుగా కడప సెంట్రల్ జైలు నుండి అనంతపురం కు ప్రత్యేక వాహనంలో తరలిస్తున్నారు.
ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి కడప జైలులో ఖైదీగా రిమాండ్ లో ఉన్నారు.