చీరాల శాంతి థియేటర్ పరిశర ప్రాంతాలన్ని హై అలర్ట్..!
ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా విలయతాండవం చేస్తోంది! అవి ఒమిక్రాన్ కేసులా.. లేక కోవిడ్ కేసులా అన్నది అర్థంకాక ప్రజలు ఆందోళన చెందుతుంటే.. వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా మొన్న మంగళవారం నాడు చీరాలలోని శాంతి థియేటర్లల్లో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఓ కుటుంబం ‘పుష్ప’ సినిమా చూశారు. థియేటర్ ఎదురుగానే నివాసం ఉంటున్న ఈ కుటుంబంలో పిల్లలు లండన్ లో ఉంటున్నారు. ఓ పనిపై లండన్ నుంచి చీరాలకు వచ్చారు. వచ్చిన రోజునే సంబంధిత పీహెచ్సీ వైద్య సిబ్బంది.. వారి వద్ద నుంచి శాంపిల్స్ సేకరించారు. కరోనా టెస్ట్ శాంపీల్స్ ఇచ్చిన వారు.. ఫ్యామిలీతో శాంతి థియేటర్లో ‘పుష్ప’ సినిమాకు వెళ్లారు. మరుసటిరోజు పరీక్షల రిజల్స్ లో కుటుంబం మొత్తం కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది! ఆ సమాచారాన్ని ఆ కుటుంబానికి తెల్పేందుకు ఇంటి వద్దకు వెళ్లిన వైద్య సిబ్బంది కంగుతిన్నారు. ఆ కుటుంబం రాత్రికే రాత్రే.. ఇంటికి తాళం వేసుకుని హైదరాబాద్ వెళ్లారంటా! ఇది తెలుసుకున్న వైద్య సిబ్బంది శాంతి థియేటర్ తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిని శానిటేషన్ చేశారు. ఆ రోజు థియేటర్ల లో సినిమాకు చూసినవారంతా ఏమైనా లక్షణాలు కనిపిస్తే.. కోవిడ్ టెస్ట్ లు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే వారికి సోకింది కరోనానా? లేక ఒమిక్రానా? అన్నది తేలాల్సి ఉందని, దీనిపై తెలంగాణ ప్రభుత్వానికి సమాచారమిస్తామని అధికారులు వెల్లడించారు.











