రాష్ట్రంలో జరుగుతున్న పలు విషయాలను చర్చించడానికి క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటుచేసింది ప్రభుత్వం. నివర్ సైక్లోన్ పై క్యాబినెట్ చర్చించింది. ఉద్యోగుల డిఎ, వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా పథకం, పాడి పరిశ్రమ, ఇంటి పన్నుల విధానం, అసెంబ్లీ సమావేశాలు ఇలా పలు అంశాలపై క్యాబినెట్ చర్చించినట్టు తెలుస్తుంది.
రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలిలా ఉన్నాయి
నవంబర్23, 26 మధ్య సాధారణ వర్షపాతం కంటే 188 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు సిఎం జగన్ కు అధికారులు నివేదికను అందించారు. వరదల కారణంగా శిబిరాలలో తలదాచుకుంటున్న ప్రతి ఒక్కరికీ 500 రూపాయలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలియవస్తుంది. వీటితోపాటు వరదల కారణంగా సంభవించిన పంట నష్టం గురించి కూడా చర్చించినట్లు తెలుస్తుంది. డిసెంబరు ఆఖరు కల్లా పంటలకు ఇన్ పుట్ సబ్సీడీ ఇవ్వాలని నిర్ణయించారు.
ఇక పోలవరం గురించి కూడా క్యాబినెట్ లో చర్చించినట్లు తెలుస్తుంది. ప్రాజెక్టు ఎత్తి ఒక్క సెంటీమీటర్ కూడా తగ్గించేది లేదని క్యాబినెట్ మీటింగ్ లో సిఎం జగన్ స్పష్టంగా చెప్పారు. 2014 నాటి ప్రత్యేక ప్యాకేజ్ రేట్లు ను మార్చి తాజా రేట్ల ప్రకారం ఇవ్వడానికి కేంద్రం సానుకూలంగా వున్నారని సిఎం జగన్ తెలిపారు. ఉద్యోగుల డిఏ బకాయిలు చెల్లించాలని నిర్ణయం. డిఏ ఒన్ 30 నెలల 3017 కోట్లు చెల్లించాలని నిర్ణయం. డిఏ టూ 30 నెలల 3017.40 కోట్లు చెల్లించాలని, ఇక డిఏ త్రి 3.14 శాతం పెంపు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇది జనవరి నుండి అమలులోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా సమయంలో విత్ హెల్డ్ లో వుంచిన ఉద్యోగుల జీతాలు, పెన్షన్ లను చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.
డిసెంబరు 25న పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలని క్యాబినెట్ లో మరొకసారి చర్చకు వచ్చింది. ఇళ్ల నిర్మాణంలో భాగంగా, తొలి దశలో 16 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడేళ్లలో వీటి నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయం. వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా పథకం 2019 ఖరీప్ సొమ్ము డిసెంబర్ 15 న చెల్లించాలని నిర్ణయించారు. ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రైతుల నుండి ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా, 1550 కోట్లు ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తోంది.
Must Read ;- ప్రభువు పుట్టిన రోజునే పేదలకు స్థలాలు.. మతలబేంటి?
రైతులను పాడి పరిశ్రమ ద్వారా అభివృద్ధి చేసేందుకు అమూల్ కంపెనీతో చేసుకున్న ఎంఓయుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 30 నుండి జరగబోయే అసెంబ్లీ సెషన్స్ లో నాణ్యమైన పశు దానా ఉత్పత్తి బిల్లు చట్టాన్ని ఆమోదం పొందేలా చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనితోపాటు ఏపి ఫిషరీస్ చట్టం ఆమోదింపచేయాలని క్యాబినెట్ లో నిర్ణయించారు. భూమి రీ సర్వే డిసెంబరు21న సిఎం జగన్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. దానికి ‘వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు పథకం’ గా పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఏపి గేమింగ్ యాక్ట్ 1974 సవరణను అసెంబ్లీ లో పెట్టడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వీటితోపాటు అర్బన్ ప్రాంతాలలో ఇంటి పన్నుల విధానంలో మార్పుల కు కూడా క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది.
అబాసుపాలు కావద్దు
ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేకంగా సిద్దం కావాలని క్యాబినెట్ మీటింగ్ లో జగన్ సూచించినట్లు తెలుస్తుంది. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ప్రభుత్వం అబాసుపాలు అయ్యేలా ప్రవర్తించకండని జగన్ గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలుస్తుంది. అలాగే శాసన మండలిలో కూడా ప్రభుత్వ వ్యూహం ప్రకారం వ్యవహారించాలని చెప్పినట్లు తెలుస్తుంది. మంత్రి బుగ్గానకు అందరినీ సమన్వయ పరిచే పని అప్పజెప్పినట్లుగా తెలియవచ్చింది.
Also Read ;- అల్లుడు జగన్ మీద అప్పుడే విరక్తి పుట్టిందా?











