కొత్త సంవత్సరంలో ప్రజలకు గొప్ప ఆఫర్..!
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఒక్క అక్టోబరు నెలలోనే 34 సార్లు పెట్రోల్, డిజీల్ ధరలను పెంచిన ఘనత కేంద్రంలోని బీజేపీది! ఈ నేపధ్యంలో వాహనదారులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న తరుణంలో ప్రజలు ఉపశమనం కోరుకుంటుంన్నారు. దీనిని గమనించిన జార్ఖండ్ ముఖ్యమంత్రి సొరెన్ ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పెట్రోల్, డిజీల్ పై ఏకంగా రూ.25 తగ్గిస్తూ ప్రకటన చేశారు. దీంతో ఆ పక్రటన విన్న ప్రజల ఆనందానికి అవధుల్లేవు! తగ్గించిన ధరలు జనవరి 26 నుంచి అమలోకి తెస్తామని తెలిపారు. దేశంలో పెట్రోలు, డిజిల్ ధరలు తగ్గడం లేదని, పేద, మధ్య తరగతి కుటుంబాలపై దాని ప్రభావం తీవ్రంగా ఉందని ఆయన భావించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ప్రజలకు ఊరట నివ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని సొరెన్ వెల్లడించారు. రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు నెలకు 10 లీటర్ల వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని కండీషన్ అప్లై అన్నారు సొరెన్! ఇలా అయినా పేద, మధ్య తరగతి కుటుంబాలకు కొంతమేరకు ఉపశమనం లబించనున్నట్లు పలువురు హర్షిస్తున్నారు. ప్రస్తుతం రూ. 98.52 ఉన్న పెట్రోల్ ధర.. ముఖ్యమంత్రి నిర్ణయంతో రూ.73.52 పైసలకు పెట్రోల్ అందనున్నది.
ఏపీలో ఆ పరిస్థితి లేదు..!
ఏపీలో ఒక్క సినిమా టికెట్ ధరలు తప్పా.. మరే ధరలపై జగన్ రెడ్డి దృష్టిసారించే పరిస్థితి లేదు. ఐదుకోట్ల ఆంధ్రుల్లో మహాయితే 50 లక్షల మంది కూడా థియేటర్ కు వెళ్లి సినిమా చూడని పరిస్థితి! కానీ నాలుగు కోట్ల మందికి పైగా ప్రత్యక్షంగా నిత్యం వాడే.. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డిజీల్ ధరలను అమాంతం పెంచి.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి చోద్యం చూస్తున్నాడు జగన్ రెడ్డి. ఆయన చర్యలు ఈ జీవితం ఉన్నంత వరకు రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. ప్రస్తుతం ఏపీలో రూ. 111 లకు పైగా లీటర్ పెట్రోలు ధర పలుకుంది. డీజీల్ రూ. 96.74 పైసలుగా ఉంది. ఈ ధరలతో ప్రజలనే కాదు.. ట్రాన్సపోర్టు వ్యాపారులను తీవ్రంగా నష్టపరుస్తోంది. ఇంకోవైపు పొరుగు రాష్ట్రాల సరిహద్దు జిల్లాలో ప్రజలు ఆయా ప్రాంతాలకు వెళ్లి పెట్రోలు, డిజీల్ కొని తెచ్చుకుంటున్నారు. దీంతో అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులను మూసేసుకుంటున్నారు.
Must Read ;- జగన్ రెడ్డి ప్రభుత్వం, కోవిడ్ వైరస్ రెండు ఒక్కటే! వర్మ సంచలన కామెంట్స్!!











