వరుస హిట్లతో అగ్రస్థానానికి చేరుకున్న దిల్ రాజుకు ఇప్పుడు వారసత్వం కూడా సినిమా రంగంలో రాబోతోంది. ఆయన అన్న కుమారుడు హీరోగా తెరంగేట్రం చేయడానికి రంగం సిద్ధమైపోయింది. కాకపోతే రాజుకు ఇప్పుడు పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. వి సినిమాని థియేటర్ కు బదులు ఓటీటీకి విడుదల చేసే పరిస్థితి వచ్చింది. షూటింగులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. దిల్ రాజును ఇండస్ట్రీలో అంతా ముద్దుగా రాజన్న అని పిలుస్తుంటారు.
ఏదైనా సినిమా బాగుందని తెలిస్తే, వారి బ్యానర్ తరుపున రిలీజ్ చేసుకోవడానికి దిల్ రాజు బృందం ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. దీంతో ఈ బ్యానర్ నుంచి ఏడాదికి 7 నుంచి 8 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే గత ఏడాదిగా దిల్ రాజు రిలీజ్ చేస్తున్న సినిమాలుకి పెద్దగా కలెక్షన్స్ రావడం లేదు. థియేటర్లో సినిమాలు విడుదల అవుతున్న విషయం పెద్దగా జనాల్లోకి వెళ్లడం లేదు. ఈ సమస్యకు కారణం ఏంటా అని తాజాగా ఆరా తీసిన దిల్ రాజుకి షాకింగ్ నిజాలు తెలిశాయట.
దిల్ రాజుకు టాలీవుడ్ ఫిల్మ్ మీడియాలో మెజార్టీ భాగం వ్యతిరేకంగా ఉందని, దీనికి కారణం ఎస్ వీ సీ బ్యానర్ కి ఉన్న ప్రమోషన్స్ టీమ్ మీడియాతో సరిగా నడుచుకోకపోవడమే అని తేలింది. అయితే ఇంత తెలిసినా దిల్ రాజు సైలెంట్ గా ఉంటున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బయట వాళ్ల సినిమాలు కాబట్టి సరిగ్గా ప్రమోషన్స్ చేయకపోయినా దిల్ రాజు బండి నడిచేస్తుందని, త్వరలో తన అన్నగారి అబ్బాయ్ ని హీరోగా లాంఛ్ చేస్తున్నారని, ఆ టైమ్ లోగా ఫిల్మ్ మీడియాతో ఉన్న సమస్యలను పరిష్కారం చేసుకోపోతే ఇబ్బందులు తప్పవని సినీ పెద్దలు మనోడికి సూచనలు ఇస్తున్నారు. రాజన్నా… ఎందుకీ రచ్చ మనకు అవసరమా! ఇడిచేయరాదే..!