వ్యాక్సినేషన్ లో ఏపీ వెనుకపడటంతో నారా లోకేశ్ సీఎం జగన్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలకు వ్యాక్సిన్ ఒక క్లిష్టమైన సమస్యగా మారిందని, ఉచిత టీకాలపై ప్రచారం చేస్తూ దినపత్రికలలో ఖరీదైన ప్రకటనలు ఇచ్చారు కానీ టీకాల సేకరణ కోసం మాత్రం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని ఆరోపించారు. మంత్రులు తమ నిర్ణయాలను ప్రచారం చేసుకోవడం తప్పా క్షేత్ర స్థాయిలో అమలు చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని లోకేశ్ మండిపడ్డారు. నేటి వరకు ఏపీలోని జనాభాలో 3 శాతం మందికి కూడా పూర్తిగా టీకాలు వేయలేదని అన్నారు. టీకా వేయడంలో ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని నారా లోకేశ్ జగన్ ను కోరారు.
వ్యాక్సిన్‌పై ప్రభుత్వ నిర్లక్ష్యం ఖరీదు ప్రజల ప్రాణాలు. ఇప్పటికైనా స్పందించి ప్రజారోగ్యం కాపాడమని ముఖ్యమంత్రి @ysjagan గారికి లేఖ రాసాను. కరోనా మరణాల సంఖ్య 9000 దాటుతున్న తరుణంలో ప్రాణాలు నిలిపే వ్యాక్సిన్ల కోసం కేంద్రాన్ని ముఖ్యమంత్రి..,(1/4) pic.twitter.com/W3EnCtDq3k
— Lokesh Nara (@naralokesh) May 14, 2021