పల్నాడు జిల్లా వైసీపీలో ఫ్యాన్ గాలి రివర్స్ తోలుతోంది. దాదాపు ఏడు నియోజకవర్గంలో వర్గపోరు తారస్ధాయికి చేరుకుంది.
2019 ఎన్నికల్లో పల్నాడు జిల్లాలోని అన్నీ అసెంబ్లీ సిగ్మెంట్లలో వైసీపీ క్లిన్ స్వీప్ చేసింది. ఏడు నియోజకజవర్గాల్లో అత్యంత బలమైన పార్టీగా ఆవిర్భవించిన వైపీసీలో ఆ ప్రాభవం నేడు కనిపించడంలేదనే చెప్పాలి. నాలుగునరేళ్ళుగా కేడర్ కు ఎమ్మెల్యేలకు మధ్య నెలకొన్న తీవ్ర అసంతృప్తి పార్టీలో వర్గపోరుకు దారితీసింది. మరోవైపు ప్రజల్లో పెచ్చురిల్లుతున్న వ్యతిరేకత వెరపి వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ జిల్లాలో తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నట్లు కనిపిస్తున్నాయి.
పల్నాడు జిల్లా అంటేనే వైపీపీకి కంచుకోట. అయితే కేడర్ లో నెలకొన్న అసంతృప్తి ఏ పాటిదో.. నరసరావుపేట, సత్తెనపల్లి సిట్టింగులను మార్చాలని.., టికెట్లు ఇస్తే ఓడించి తీరుతామని సీఎం జగన్ క్యాంపు కార్యాలయం.., పార్టీ కేంద్ర కార్యాలయం ఎదుట కేడర్ నిరసన వ్యక్తం చేయడమే నిదర్శనం. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు టికెట్ల్ ఇస్తే.. సత్తెనపల్లిలో పార్టీని ఎలా ఓడించాలో తమకు బాగా తెలుసు అని ఇప్పటికే జగన్ రెడ్డికి తాడేపల్లి వెళ్ళి లోకల్ ప్రజా ప్రతినిధులు, వైసీపీ ముఖ్య నేతలు మేసేజ్ ఇచ్చి వచ్చారు. మరోవైపు గురజాల్లో కూడా వర్గపోరు బహిర్గతమవుతోంది.
గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దొ అంటూ ఎమ్మెల్సీ జంగా వర్గం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ..,ఈ సారి జంగాకు తప్పనిసరిగా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి విడుదల రజిని ప్రతినిధ్య వహిస్తున్న చిలకలూరిపేటలో కూడా వైసీపీ వర్గపోరు నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఆయనను కాదని కనీసం రాజకీయ పరిచయం లేని అనాముకుడైన మల్లెల రాజేష్ కు చిలకలూరిపేట అసెంబ్లీ ఇంచార్జ్ పదవీ కట్టపెట్టడం ఏమిటని..? మర్రి.., విడుదల రజిని వర్గీయులు గుర్రుగా ఉన్నారు.
వినుకొండ నియోజకవర్గంలో కూడా రాజకీయంగా రగిలిపోతోంది. ఎమ్మెల్యే బొల్లాకు టికెట్ ఇస్తే.. ఓడించి తీరుతామని కేడర్ ఇప్పటికే డిసైడ్ అయ్యి ఉంది. అలానే పెదకూరపాడులో పరిస్ధితి విభిన్నమైన రాజకీయ పరిస్ధితి నెలకొంది. ఇసుక మాఫియాపై పెత్తనం కోసం ఎమ్మెల్యే శంకరరావు వర్సెస్ జేపీ గా కొంతకాలం సాగింది. కట్ చేస్తే చివరికి ఇసుక పోరులో సొంత వర్గంపైనే తానే కేసులు పెట్టించాల్సి పరిస్ధితికి దిగజారారు. దీంతో ఇక్కడ కేడర్ ఎమ్మెల్యే పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
మరోవైపు మాచర్ల నియోజకవర్గంలో కూడా వైసీపీలో కేడర్ లో.., ప్రజల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఐ ప్యాక్, వైసీపీ సొంత సర్వేలు సైతం పిన్నెల్లి ఘోరంగా ఓడిపోతున్నారని రెండేళ్ళ క్రితమే చెప్పేశాయి. పిన్నెల్లికి టికెట్ ఇస్తే .. ప్రజలతో పాటు పార్టీ కేడర్ కూడా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అందుతున్న విశ్లేషణలు.
ఇలా మొత్తంగా పల్నాడు జిల్లాలో వైసీపీ రాజకీయ ప్రస్ధానం ముగిసిపోయే అధ్యాయంగా కనిపిస్తోంది. పల్నాడు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, విడుదల రజిని, నంబూరు శంకరరావు, బొల్లా లకు టికెట్లు ఇస్తే.. 2024లో ఘోర పరాజయం తప్పదని సర్వేలు చెప్తున్న సత్యాలు.