డాక్టర్ సుధాకర్..వైసీపీ హయాంలో మాస్క్ అడిగినందుకు ఆనాటి ప్రభుత్వ పెద్దలు హింసించి సుధాకర్ చని*పోయేలా చేసిన ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. ఆ వ్యవహారం ఇప్పటికీ వైసీపీని వెంటాడుతోంది. జగన్ మాకవరం పాలెం మెడికల్ కాలేజీ పరిశీలనకు వెళ్తున్న సమయంలో ఆయన వెళ్లే మార్గంలో పెద్ద ఎత్తున డాక్టర్ సుధాకర్ ఫోటోతో ఫ్లెక్సీలు వెలిశాయి. మాస్క్ ఇవ్వలేక హత్యలు చేసేవాళ్లు మెడికల్ కాలేజీ గురించి మాట్లాడటమా అంటూ ఆ ఫ్లెక్సీలపై రాసి ఉంది. ప్రజలు అలర్ట్‌గా ఉండాలని హెచ్చరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
డాక్టర్ సుధాకర్ వ్యవహారం దేశంలోనే అత్యంత వివాదాస్పదంగా మారింది. సుధాకర్ దళితుడు. నర్సీపట్నం హాస్పిటల్‌లో పని చేసే వారు. కరోనా సమయంలో ప్రభుత్వం కనీసం మాస్కులు ఇవ్వడం లేదని ఓ సందర్భంలో తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆ వీడియో బయటకు రావడంతో ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఆయనను వేధించింది. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి సన్నిహితుడని ఆయనపై ముద్ర వేసింది. చివరకు ఆయనకు మానసిక పరిస్థితి బాగా లేదని హాస్పిటల్‌లో కూడా చేర్పించారు.
సుధాకర్‌పై కక్ష గట్టిన ఆనాటి జగన్ ప్రభుత్వం ఆయనను ఘోరంగా అవమానించింది. ఓ సందర్భంలో ఇంటి లోన్ చెల్లించేందుకు బ్యాంకుకు వెళ్లిన ఆయనను నడిరోడ్డుపై ఆపి బట్టలు చింపి..చేతులు వెనక్కి కట్టి అత్యంత దారుణంగా నడిబజారులో నిలబెట్టారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు కూడా హైకోర్టు ఆదేశించింది. ఆ విచారణను సీల్డ్ కవర్ లో సీబీఐ సమర్పించింది. హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుందో ఎవరికీ తెలియదు. తర్వాత సుధాకర్ మానసికంగా కుంగిపోయి ఆరోగ్యం పాడై చని*పోయారు. సుధాకర్ ఘటన జగన్ క్రూరత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది.
ఈ నేపథ్యంలోనే దళిత సంఘాల నేతలు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ PPE కిట్లు, మాస్కులు అడిగినందుకు ఆయన్ను మానసికంగా వేధించారని దళిత సంఘాలు ఆరోపించాయి. సుధాకర్ మృ*తికి గత ప్రభుత్వమే కారణమని దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ క్షమాపణ చెప్పిన తర్వాతే నర్సీపట్నంలో అడుగు పెట్టాలని ఫ్లెక్సీలు వెలిశాయి.











