మెగా DSC 2025 ప్రక్రియను చూసి ఓర్వలేక, వైసీపీ రోజుకో కొత్త అబద్ధంతో తప్పుడు ప్రచారాలకు తెరలేపుతోంది. దీంతో కూటమి ప్రభుత్వం వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు పక్కా ఆధారాలు, ప్రూఫ్స్‌తో వైసీపీ ఆడుతున్న డ్రామాలకు చెక్ పెట్టబోతున్నారు అధికారులు. DSC 2025కు సంబంధించిన వివిధ కేసులపై కోర్టుల్లో ప్రభుత్వం తన వాదనలను పకడ్బందీగా వినిపించిన కారణంగా, ఇప్పటివరకు కోర్టుల్లో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని, పైగా ప్రభుత్వ వాదనలకే పూర్తి సమర్థన లభించిందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
వైసీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసమే పనిగట్టుకుని DSCపై పదే పదే నిరాధార ఆరోపణలు చేయడం ఎంతమాత్రం సబబు కాదని అధికారులు మండిపడుతున్నారు. అభ్యర్థుల సందేహాలు, సమస్యల పరిష్కారం కోసం వివిధ స్థాయిల్లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌ల ద్వారా ఏకంగా మూడున్నర వేలకు పైగా వచ్చిన అభ్యంతరాలను అధికారులు అత్యంత సంతృప్తికర స్థాయిలో పరిష్కరించారు. అంతేకాకుండా, అభ్యర్థులు లేవనెత్తిన హారిజాంటల్ రిజర్వేషన్, స్పోర్ట్స్ కోటా అంశాలపై కూడా సంబంధిత అధికారులు ఇదివరకే పూర్తి స్థాయిలో, పారదర్శకంగా వివరణ ఇచ్చారు. అయినప్పటికీ, తమ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తూ నిరుద్యోగులను మోసం చేయాలనే వైసీపీ నైజాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో మెరిట్ ఆధారంగా మాత్రమే డీఎస్‌సీ 2025 నియామకాలను జరుపుతుంటే కడుపుమంటతో రగిలిపోతున్నారు వైసీపీనేతలు. గతంలో ఇచ్చిన క్లారిటీతో పాటు, సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ అధికారులు నిర్వహించబోయే భారీ ప్రెస్ మీట్‌లో మరింత స్పష్టమైన ఆధారాలతో వైసీపీ ఫేక్ ప్రచారాల బండారాన్ని బద్దలు కొట్టనున్నారు.
నిరుద్యోగుల భవిష్యత్తును అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తే రాష్ట్ర యువత ఆ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయం. పారదర్శక పాలనతో ముందుకు సాగుతున్న ప్రభుత్వాన్ని ఇలాంటి పనికిమాలిన ఆరోపణలతో ఏమీ చేయలేరని, అభివృద్ధి మరియు ఉపాధి కల్పన ప్రయాణాన్ని ఆపలేరని వైసీపీ గుర్తించాలి. ఇప్పటికైనా ఈ వక్రబుద్ధి రాజకీయాలు మానుకోకపోతే ప్రజలే ఆ పార్టీని పూర్తిగా తిరస్కరిస్తారు.











