రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల నేతలు సైతం ఫిదా అవుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు, పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు నీటిని తరలించడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరువు కాలంలో ఒకేసారి రెండు భారీ సాగు నీటి ప్రాజెక్టులను ప్రారంభించడంపై.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా చంద్రబాబు పనితీరుని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారని వార్తలు వస్తున్నాయి.
ఏపీలో ఏ ప్రాజెక్టులు నిర్మించినా రాజకీయం చేయడానికి బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుంది. కానీ వెలిగొండ, పోలవరం ఎడమ కాలువలను ఓకేసారి ప్రారంభించినా.. గులాబీ నేతల నుంచి పెద్దగా వ్యతిరేక స్వరాలు వినిపించలేదు. కరువు ప్రాంతాల రైతులకు మేలు చేసే ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. పబ్లిక్ ఒపీనియన్‌కి అనుగుణంగా బీఆర్ఎస్ నాయకులు కూడా చంద్రబాబు పనితీరుకి హ్యాట్సాఫ్ చెప్పాల్సి వస్తోంది.
తెలంగాణలో లక్ష కోట్లకుపైగా వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినా.. మేడిగడ్డ కుంగిపోవడంతో.. ఆ ప్రాజెక్టు ప్రయోజనాలు ప్రజలకు అందడం లేదు. మరోవైపు ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగిస్తూనే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను తరలించారు. పురుషోత్తపట్నం లిఫ్ట్ స్కీమ్ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి నీటిని అందించేందుకు ప్లాన్ చేశారు.
ప్రతిపక్షంలో ఉండగా పట్టిసీమ, పురుషోత్తపట్నం పంపులు పీకేస్తానని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక.. పోలవరం ఎడమ కాలువ పనులను పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి.. జగన్ పీకేస్తానన్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్రకు నీటిని అందిస్తున్నారు.
ప్రజలకు, రైతులకు నీళ్లు కావాలి. అవి గ్రావిటీ ద్వారా వస్తున్నాయా.. మోటార్లతో లిఫ్ట్ చేసి తీసుకొస్తున్నారా అనేది ఎవరికీ అవసరం లేదు. అందుకే పోలవరం పూర్తి కాలేదు.. ఈ నీళ్లు గ్రావిటీ ద్వారా వస్తున్నవి కావు అని వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను ఎవరూ పట్టించుకోవడం లేదు. పోలవరం పూర్తి కాకపోయినా.. అవసరమైన సమయంలో ఉత్తరాంధ్రకు నీటిని అందించడాన్ని స్వాగతిస్తున్నారు. ఈ ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేతల సైలెన్స్ చంద్రబాబు సక్సెస్‌కి నిదర్శనంగా నిలుస్తోంది.











