ఏపీలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా DSC ప్రక్రియను చూసి ఓర్వలేక, వైసీపీ రోజుకో అబద్ధంతో రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తోంది. ఎలాంటి ఆధారాలు లేని గాలి వార్తలను, ఫేక్ డాక్యుమెంట్లను ముందుకు తెచ్చి ప్రభుత్వంపై బురదజల్లుతున్న ఆ పార్టీ బండారం బట్టబయలైంది. గత ఐదేళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగులను నట్టేట ముంచిన వైసీపీ నేతలు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఉద్యోగాలు ఇస్తుంటే కడుపుమంటతో ఫేక్ ప్రచారాలకు తెరలేపారు.
అసలు వైసీపీ లేవనెత్తుతున్న ఆరోపణల వెనుక అసలు నిజాలు ఏమిటంటే..గ్రౌండ్ లెవల్ ఆధారాలు లేకుండా, కేవలం సోషల్ మీడియాలో మైండ్ గేమ్ ఆడేందుకు పనికిమాలిన నంబర్లు, కల్పిత ఉదాహరణలను తెరపైకి తెస్తున్నారు వైసీపీ నేతలు. పరీక్షల నిర్వహణలో, మెరిట్ జాబితాల తయారీలో పారదర్శకత లేదంటూ అర్ధరహిత వాదనలు వినిపిస్తున్న ఫ్యాన్ పార్టీ నాయకులు..తాము అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాల భర్తీని గాలికొదిలేసి, నిరుద్యోగులపై లాఠీచార్జీలు చేయించిన దారుణాలను రాష్ట్ర ప్రజలందరూ గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడు అవే ఆరోపణలను మళ్లీ రిపీట్ చేస్తూ, అభ్యర్థుల్లో అనవసరమైన అభద్రతాభావాన్ని, గందరగోళాన్ని సృష్టించడమే లక్ష్యంగా కుట్రపూరిత రాజకీయాలు నడుపుతున్నారు.
మరోవైపు కూటమి ప్రభుత్వం మాత్రం నియామక ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ, ఏ ఒక్క అభ్యర్ధికి కూడా అన్యాయం జరగకుండా అత్యంత కఠినమైన నిబంధనలతో ఈ మెగా DSCని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుంటే.. ఓర్వలేక వైసీపీ నేతలు దిగజారుడు విమర్శలకు దిగుతున్నారు. నియామకాల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ వారు చూపిస్తున్న ప్రూఫ్స్ అన్నీ పూర్తిగా నిరాధారమైనవని, కనీస చెక్ చేయకుండా మీడియా ముందుకు వచ్చి పచ్చి అబద్ధాలు వల్లె వేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రజల్లో పూర్తిగా విశ్వసనీయత కోల్పోయి, రాజకీయ అస్తిత్వం కోసం పాకులాడుతున్న ఆ పార్టీ నేతల డ్రామాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు.
ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలనే కుట్రతో రోజుకో ఫేక్ కథనాన్ని వైసీపీ నేతలు అల్లుతున్నారు. నిరుద్యోగుల భవిష్యత్తును అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తే రాష్ట్ర యువత ఆ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయం. పారదర్శక పాలనతో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వాన్ని ఇలాంటి పస లేని ఆరోపణలతో ఏమీ చేయలేరని, అభివృద్ధి, ఉపాధి కల్పన ప్రయాణాన్ని ఆపలేరని వైసీపీ గ్రహించాలి. ఇప్పటికైనా ఈ వక్రబుద్ధి రాజకీయాలు మానుకోకపోతే ప్రజలే ఆ పార్టీని పూర్తిగా తిరస్కరిస్తారు.











