క్రికెట్ కింగ్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ‘ఫ్రెండ్ షిప్’. భారీ బడ్జెట్ తో తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాని తెలుగులోనూ విడుదలచేయనున్నారు. జాన్ పాల్ రాజ్ – శ్యామ్ సూర్య సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సింగ్ అండ్ కింగ్ అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. దీని టైటిల్ లోగోను ఈరోజు ఆవిష్కరించారు. టైటిల్ లోగోను మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్ధ స్వామి మంత్రాలయంలో ఆవిష్కరించి ఆశీస్సులు అందించారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాని తెలుగులో అందిస్తోంది. దీనికి నిర్మాత ఎ. ఎన్. బాలాజీ. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ లో ఉంది.
కోయంబత్తూర్, ఊటీలలో షూటింగ్ చేస్తున్నారు. మాజీ మిస్ శ్రీలంక, తమిళ బిగ్ బాస్ విన్నర్ లోస్లియా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర తమిళ నిర్మాత జె. సతీష్ కుమార్ (జెఎస్ కె) విలన్ గా నటిస్తున్నారు. నిర్మాత ఎ.ఎన్. బాలాజీ మాట్లాడుతూ మంత్రాలయం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్ధ స్వామి తమ సినిమా టైటిల్ లోగో ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇప్పటివరకు తాను తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో 50కి పైగా సినిమాలు నిర్మించానని, తన కెరీర్ లో తొలిసారి పెద్ద బడ్జెట్ సినిమాను అందిస్తున్నానని చెప్పారు.
Must Read ;- ఖిలాడి విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్











