యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. తమిళ .. తెలుగు భాషల్లో యాక్షన్ హీరోగా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన హీరో. ప్రస్తుతం ఆయన విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన తమిళంలోనే కాదు .. తెలుగులోను ప్రతినాయక పాత్రలను చేస్తున్నాడు. తమిళంలో విశాల్ హీరోగా రూపొందిన ‘ఇరుంబుతిరై’ .. తెలుగులో నితిన్ హీరోగా వచ్చిన ‘లై’ సినిమాలో ఆయన చేసిన విలన్ పాత్రలు విలక్షణంగా ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం అర్జున్ ‘ఖిలాడి‘ సినిమాలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అర్జున్ పోస్ట్ చేసిన స్టిల్ చూస్తుంటే, ఈ సినిమాలో ఆయన స్టైలీష్ విలన్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. రవితేజ కథానాయకుడిగా దర్శకుడు రమేశ్ వర్మ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ‘ప్లే స్మార్ట్’ అనే ట్యాగ్ లైన్ కారణంగా, హీరోకి – విలన్ కి మధ్య గేమ్ ఒక దోబూచులాట మాదిరిగా సాగుతుందని అర్థమవుతోంది. ‘నువ్వా? నేనా?’ అన్నట్టుగా ఈ రెండు పాత్రలు పోటాపోటీగా సాగుతాయని అంటున్నారు.
రవితేజ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ – అర్జున్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లోను రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయని అంటున్నారు. రామ్ – లక్ష్మణ్, .. అన్బు – అరివు అనే నలుగురు ఫైట్ మాస్టర్లు ఈ సినిమాకి పనిచేస్తూ ఉండటం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. రమేశ్ వర్మకు ‘రాక్షసుడు’ మినహా హిట్లు లేకపోవడం, ఎంతమాత్రం క్రేజ్ లేని డింపుల్ హయతి – మీనాక్షి చౌదరి అనే ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేయడం పట్లనే రవితేజ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- ,విజయ్, నాని తర్వాత ఇతని కన్ను రవితేజ పై పడిందా?