యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల అనసూయ.. సినిమాలతో కూడా ఓ రేంజ్ లో పేరు తెచ్చుకుంది. ఆమె పోషించిన కొన్ని పాత్రలు ప్రేక్షకుల మన్నననలు పొందాయి. గ్రాడ్యుయల్ గా అనసూయ పేరు ఇతర భాషలకు కూడా బాగా వ్యాపించింది. ప్రస్తుతం తెలుగులో పలు చిత్రాల్లో నటించడంతో పాటు .. విజయ్ సేతుపతి నటిస్తున్న ఓ తమిళ మూవీతో కూడా అనసూయ తన ఎంట్రీ ఖాయం చేసుకుంది. అందులో ఓ కీలకపాత్ర పోషిస్తోంది. ఇక ఇప్పుడు మాలీవుడ్ లో కూడా అనసూయ తొలి చిత్రం చేయబోతుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
మమ్ముట్టి హీరోగా .. అమల్ నీరద్ తెరకెక్కిస్తోన్న యాక్షన్ మూవీ ‘భీష్మ పర్వం’. ఇందులో ఆయన గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర అనసూయను వరించడం విశేషంగా మారింది. మమ్ముట్టి నటించిన స్ట్రైట్ తెలుగు మూవీ యాత్రలో అనసూయ ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన తో డైరెక్ట్ మల్లూ మూవీలోనే నటించనుండడం గ్రేటే. రీసెంట్ గా సెట్స్ మీదకు వెళ్ళిన ‘భీష్మ పర్వం’ అనసూయకి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- పైన పటారం అంటూ అదరగొట్టేస్తున్న అనసూయ