విక్టరీ వెంకటేష్ బిఫోర్ లాస్టియర్ ‘ఎఫ్ 2, వెంకీమామ’ చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్నారు. అయితే కరోనా కారణంగా లాస్టియర్ ఆయన నుంచి ఎలాంటి సినిమాలూ రాలేదు. ప్రస్తుతం వెంకీ.. ‘నారప్ప, ఎఫ్ 3’ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలతో పాటు ఇప్పుడు లిస్ట్ లో మరో సినిమాకూడా యాడ్ అయింది. అదే ‘దృశ్యం 2’. రీసెంట్ గా మలయాళంలో విడుదలై.. బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న ఈ సినిమాను తెలుగు కూడా రీమేక్ చేసేందుకు సురేష్ ప్రొడక్షన్స్ రంగంలోకి దిగింది. ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు జీతూ జోసఫే తెలుగు వెర్షన్ కు దర్శకుడు.
అయితే ఇప్పుడు వెంకీ కెరీర్ కు ఒక విశేషం యాడ్ అయింది. అదేంటంటే.. ఆయన ఒకేసారి రెండు సీక్వెల్స్ లో నటిస్తున్నారు. అందులోనూ ఈ రెండు చిత్రాలు మొదటి భాగంతో బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు వీటి సీక్వెల్స్ తెరకెక్కనుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ‘ఎఫ్ 2’ 2019 సంక్రాంతికి విడుదలై.. ఆ సీజన్ లో విడుదలైన సినిమాలకు చెక్ పెట్టింది. ఇప్పుడు దీనికి సంబంధించిన సీక్వెల్ షూటింగ్ ను శరవేగంగా చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అంతేకాదండీ.. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్ట్ 27న విడుదల చేయబోతున్నారు.
అలాగే.. అంతే వేగంతో .. వెంకటేష్ ‘దృశ్యం 2’ సినిమాను కూడా కంప్లీట్ చేసే ప్లాన్ తో ఉన్నాడు దర్శకుడు జీతూ జోసెఫ్. ఒరిజినల్ వెర్షన్ ను లాక్ డౌన్ టైమ్ లో మొదలు పెట్టడమే కాకుండా.. సినిమాను కేవలం 46 రోజుల్లో కంప్లీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడాయన. ఇప్పుడు తెలుగు వెర్షన్ ను కూడా అదే స్పీడ్ గా కంప్లీట్ చేసి.. నారప్ప, ఎఫ్ 3 సినిమాల మధ్యలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ రెండు సీక్వెల్స్ .. వెంకటేష్ కెరీర్ ను ఎలాంటి మలుపు తిప్పుతాయో చూడాలి.
Must Read ;- తెలుగులో వెంకీతో జీతూ ‘దృశ్యం 2’











