శృతిహాసన్.. ఇటీవల మాస్ మహారాజా రవితేజతో కలిసి క్రాక్ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన వకీల్ సాబ్ సినిమాలో నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. మళ్లీ యాక్టింగ్ వైపు కాన్ సన్ ట్రేషన్ చేస్తూ.. మంచి పాత్రలు పోషించాలి అనుకుంటున్న ఈ తరుణంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. పాన్ ఇండియా మూవీ సలార్ లో శృతిహాసన్ నటిస్తుంది.
ఇటీవల ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ప్రేమలో ఫెయిల్ కావడంతో ఇక ప్రేమ జోలికి వెళ్లకూడదు అనుకున్నాను అని గతంలో చెప్పింది. అయితే.. ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడిందని గత కొన్ని రోజులు నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజా వార్త ఏంటంటే.. ఈ అమ్మడు డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ప్రేమలో పడిందని ప్రచారం జరుగుతోంది. వారిద్దరు పలు చోట్ల జంటగా కనపడుతున్నారు. శృతిహాసన్ పుట్టినరోజు సందర్భంగా శాంతను పెట్టిన పోస్టులు కూడా ఇందుకు బలాన్నిస్తున్నాయి.
మరోపక్క, మ్యూజిక్ కంపోజింగ్ మీద శృతిహాసన్‌కు మొదటి నుంచీ మక్కువ ఎక్కువ. ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది. అయితే.. శృతి లేటెస్ట్ గా ఓ మ్యూజిక్ వీడియోను చేస్తుంది. ఈ మ్యూజిక్ వీడియోలో శాంతను ర్యాప్ పాడనున్నాడు. గతంలోనూ ర్యాపర్‌గా ఆయన కొన్ని పాటలు పాడాడు. వీరిద్దరూ ఇప్పడు లవ్ లో ఉన్నారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. శాంతనుతో ఉన్న వీడియో, ఫోటోలను శృతి హాసన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై శృతిహాసన్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
Must Read ;- శృతి భారీగా డిమాండ్ చేసిందా?