పల్నాడు జిల్లా మాచర్లలో రాజకీయాలు రౌడీయిజాన్ని తలపిస్తున్నాయి. తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు.., మాచర్ల నియోజకవర్గం ఇంచార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి ఇరికించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది పీఆర్కే అండ్ కో.
పల్నాడు జిల్లా మాచర్ల.. రౌడీ రాజకీయాలకు.., దౌర్జన్యాలకు కేఆర్ఫ్. ఇక్కడ చీమ చిటుక్కు మనాలన్న ఆయన ఆజ్ఞలేనిది జరగదు. రెండు దశాబ్ధాలుగా మాచర్లలో తిరుగులేని నేతగా.., నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పీఆర్కే.. నేడు పిల్లి కన్న దారుణంగా భయపడి పోతున్నాడు. తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గం ఇంచార్జ్ గా డిసెంబర్ 22, 2021 న జూలకంటి బ్రహ్మానందరెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. నాటి నుంచి స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్యాంటు తడుపుకుంటున్నారు. షుగర్ లెవల్స్.. బీపీ అమాంతం పెరిగి.. దుర్గిలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చేందుకు తన తాగుబోతు అనుచరుడితో జనవరి 2, 2022న విఫలయత్నం చేశాడు. ఆ తరువాత అదే నెల జనవరి 3, 2022న దుర్గి మండలం జంగమహేశ్వరపాడు వద్ద టీడీపీ కార్యకర్త కంచర్ల జలయ్య ను ప్రత్యర్థులు కాపుకాసి దారుణంగా నరికి చంపారు. అదే నెలలో జనవరి 13, 2022న తోట చంద్రయ్యను దారుణంగా నడిరోడ్డులో గొంతు కోసి చంపారు. ఆనాటి నుంచి గడిచిన ఈ రెండేళ్ళల్లో బ్రహ్మానందరెడ్డిని టార్గెట్ కిరాయి సైన్యంతో ఎమ్మెల్యే పీఆర్కే చేస్తున్న రౌడీ రాజకీయ దాడులు కోకొల్లలు అని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు.
బ్రహ్మానందరెడ్డి మాచర్ల బాధ్యతలు చేపట్టిన వారం పదిరోజుల్లోనే టీడీపీపై ఇటువంటి దాడులకు తెగపడి హత్యరాజకీయాలకు.., పల్నాడు ఫ్యాక్షన్ కు తెరతీశారు. వరుసగా టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ తన దౌర్జన్యకాండ సాగిస్తున్నారు పిన్నెల్లి బ్రదర్స్. ఇదిలా ఉండే డిసెంబరు 16, 2022 న తెలుగుదేశం ఆధ్వర్యంలో మాచర్ల టౌన్ లో తలపెట్టిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి..,మన మాచర్ల కు అనే కార్యక్రమంలో ఇంఛార్జ్ బ్రహ్మనందరెడ్డిపై.. ఇతర తెలుగు దేశం సీనియర్ నాయకులపై రాళ్ళు రువ్వి.. నాటు కర్రలతో దాడికి దిగారు వైసీపీ నాయకులు. మాచర్ల మున్సపాలిటీ చైర్మన్ తురక కిషోర్ ఆధ్వర్యంలో సాగిన ఈ దౌర్జన్యకాండను దేశం మొత్తం నివ్వెరబోయింది. బీహార్ కన్న దారుణంగా దాడులకు తెగపడి మాచర్ల లో మరిచిపోయిన ఫ్యాక్షన్ ను తిరిగి గుర్తు చేశారు. ఈ ఘటనలో తెలుగు దేశం నాయకులు తీవ్రంగా గాయపర్చడమేకాక.. వారి ఆస్తులను సైతం ధ్వసం చేశారు పీఆర్కే అండ్ కో. తిరిగి టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారు.ఈ కేసులో వైసీపీ నాయకులను తప్పించి.. కేవలం టీడీపీ నాయకులు.., కార్యకర్తలపైనే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు.
తాజాగా నెల రోజుల క్రితం (ఆగస్టు 29, 2023) నియోజకవర్గంలోని వెల్దూర్తి మండలం గొట్టిపాళ్ళలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ కేసులు పలువురు టీడీపీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. ఇళ్ళలోకి చొరపడి మరి అడ్డొచ్చిన మహిళలను కొట్టి.. చిన్నపిల్లను గాయపర్చి మరి టీడీపీ నేతలను గొడ్డలితో నరికి .. నరికి.. గాయపరిచారు. ఈ ఘటనలో కూడా తెలుగు దేశం నాయకులు.., కార్యకర్తలపైనే కేసులు పెట్టారు. కానీ.. వైసీపీ నుంచి కొంతమందిని అదుపులోకి తీసుకుని.. పీఆర్కే ప్రొద్బలంతో వెంటనే వదిలేశారు. టీడీపీ వాళ్ళపై 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనలో ఎక్కడ లేని బ్రహ్మానందరెడ్డిని ఈ కేసులో ఏ12 గా చేర్చారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన తిరుపతిలో ఉన్నారని సాక్ష్యాలు చూపుతున్న అక్రమంగా కేసు నమోదు చేసి..జైలుకు పంపేందుకు పీఆర్కే కుట్రలు పన్నుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్ని నీచ రాజకీయాలు చేసినా.. టీడీపీ ఘన విజయాన్ని.., మాచర్ల లో బ్రహ్మానందరెడ్డి గెలుపును ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల సమీపిస్తున్న వేళ.. అక్రమ కేసుల్లో బ్రహ్మానంద రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపి.. దొడ్డిదారిలో దౌర్జన్యకాండ సాగించేనా సరే గెలవాలన్నది పీఆర్కే మార్క్ రౌడీ రాజకీయంలో భాగం. అందుకే అక్రమ కేసులు పెట్టి బ్రహ్మానందరెడ్డిని జైలుకు పంపాలని చూస్తున్నారు. దీన్ని నియోజకవర్గ ప్రజలు గమనిస్తునే ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా.. మాచర్ల పట్టిన పిన్నెల్లి దౌర్జన్యకాండను.., దరిద్రాన్ని ఎప్పుడు వదిలిద్దామని ప్రజలు వెయి కళ్ళతో ఎదురు చూస్తున్నారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల దుమ్మెత్తిపోస్తున్నది వాస్తవం.











