ఏపీలో పవన్ ప్రభంజనానికి ఎదురులేకుండా పోతుండం, వారాహి నాలుగో విడత యాత్రకు తెలుగుదేశం
కేడర్ కూడా తోడవడంతో ప్రభుత్వ వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతోంది. అవనిగడ్డలో మొదలైన నాలుగో విడత వారాహి యాత్ర కు, ఇంతకు ముందు జరిగిన వారాహి యాత్రలకు ఎంతో తేడా ఉందని అర్థం చేసుకున్న ప్రభుత్వ వర్గాలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దారుణ కుట్రకు తెరతీశాయని సమాచారం. పవన్ కళ్యాణ్ అంచనాలకు కంటే భిన్నంగా బలమైనరాజకీయ శక్తిగా ఎదగడంతో వైసీపీ నేతల్లో కడుపుమంట పెరిగిఆపోతోంది. ఎలాగైనా వారాహి యాత్రను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. ఇదే అంశాన్ని కృష్ణా జిల్లా పెడన సభకు ముందు పవన్ కళ్యాణ్ బహిరంగంగ లేఖ ద్వారా ప్రకటించారు.
పెడన సభలో రాళ్ల దాడికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేశారు. గతంలో గోదావరి జిల్లాల్లోనూ వారాహి యాత్ర ప్రారంభం తర్వాత అశేష జనాదరణ చూసి తట్టుకోలేకపోయిన వైసీపీ నేతలు తనపైనా వారాహి యాత్రపై ఎన్నో కుట్రలు చేశారని ఆరోపించినపవన్ తాజాగా పెడన సభను అడ్డుకునేందుకు క్రిమినల్స్ ను రంగంలోకి దించారన్న సమాచారం తమ వద్ద ఉందన్నారు. పెడనలో బుధవారం పబ్లిక్ మీటింగ్‌లో రాళ్ళ దాడి చేసి గొడవ చేయాలని ప్లాన్ చేశారంటున్నారన్నారు. తమ పెడన సభలో గొడవలు సృష్టిస్తే.. సహించమని హెచ్చరించారు.
సీఎం, డీజీపీ, ఇతర అధికారులు జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలన్నారు. టీడీపీ, జనసేన పొత్తును విచ్చిన్నం చేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాళ్ల దాడి జరిగినా, క్రిమినల్స్ ఎటాక్ చేసినా.. ప్రభుత్వం, డీజీపీలదే బాధ్యత అని అన్నారు. జిల్లా ఎస్పీలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జనసేనాని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా జగన్ కు చెబుతున్నాం అంటూ దీనిపై పవన్ కళ్యాణ్ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. పులివెందుల రౌడీయిజం చేస్తే.. మేము చూస్తూ ఊరుకోమని పవన్ కళ్యాణ్ ఆలేఖలో ప్రస్తావించారు. దాడులు చేస్తే.. జనసేన సైనికులు ఎదురు దాడి దిగకండని తమ కార్యకర్తలకు సూచించారు. ఎవరు అనుమానంగా ఉన్నా.. జేబుల్లో నుంచి ఆయుధాలు తీసినా.. వారిని పట్టుకుని పోలీసులకు తీసుకెళ్లి అప్పగించండని పవన్ చెప్పారు.
పెడన సభకు డ రెండు, మూడు వేల మంది రౌడీ మూకలు వచ్చే అవకాశం ఉందన్న పవన్…వారికంటే జనసేన సైనికుల సంఖ్యా బలం చాలా ఎక్కువని గుర్తు చేశారు. అయినా వారిపై దాడి చేయకండి ని అభిమానులకు చెప్పారు. ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే.. భవిష్యత్ లో చాలా దారుణంగా ఉంటుంది గుర్తు పెట్టుకో వాలని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.