స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో టీడీపీ తరుఫున న్యాయవాదులు క్వాష్ పిటిషన్ తో సుప్రీ కోర్టును ఆశ్రయించారు. పోయిన నెల 27న పిటిషన్ సీజేఐ వాయిదా వేయగా.. మంగళవారం 6వ కోర్టులో వాదనలు జరిగాయి. జస్టిస్ అనిరుద్ద బోస్.., జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. చంద్రబాబు తరుఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్దార్థ్ లూథ్రా, అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించగా.. ఏపీ సీఐడీ తరుఫున ముకుల్ రోహత్గీ వాదించారు.
ప్రధానంగా జరిగిన వాదనల్లో 17ఏ అంశాన్నే ఎక్కువ శాతం చంద్రబాబు తరుఫున న్యాయవాదులు వినిపించారు. 2018 జులైలో 17ఏ చట్ట సవరణ చేయగా.. 2021 లో నమోదైందని.. ఈ కేసుకు 2017 లోనే కేసు మూలాలు ఉన్నందున 17 ఏ వర్తించదన్నారు. అయితే 17ఏ చట్ట సవరణ జరగాడానికి ముందే స్కిల్ కేసుపై విచారణ జరిగిందనడానికి ఆధారాలు, పత్రాలు ఏమైనా ఉన్నాయా అని రోహిత్గీని జస్టిస్ అనిరుద్ద బోస్ ప్రశ్నించారు.
ఈ కేసులో పిటిషనర్ కౌంటర్ వేయలేదని రోహత్గీ చెప్పగా.. అన్నీ ఆధారాలను కోర్టు ముందు ఉంచినట్లు లూథ్రా గుర్తు చేశారు. కేసులో పూర్తి వివారాలతో సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. బెయిల్ కోసం వెళ్లకుండా క్వాష్ పిటిషన్ పైనే పిటిషనర్ తరుఫున న్యాయవాదులు వాదిస్తున్నారని రోహత్గీ న్యాయమూర్తికి విన్నవించారు. దీనిపై స్పందిచిన లూథ్రా అన్నీ ఆధారాలను బెంచ్ కు సమర్పించామని చెప్పారు. 17ఏ వర్తించిద్దా..? లేదా ..? మేం చూసుకుంటాం.. మందు హైకోర్టులో మీరు ఫైల్ చేసిన ఆధారాలను సమర్పించాలని జస్టిస్ అనిరుద్ద బోస్ రోహిత్గీని ఆదేశించారు. కేసును ఈ నెల 9కి వాయిదా వేసింది జస్టిస్ అనిరుద్ద బోస్.., జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం. దీంతో సీఐడీ తరుఫున వాదించే న్యాయవాదికి.., ఈ కేసును తెరవెనుక నడిపించే జగన్ అండ్ కో గూబ గుయ్యిమనేలా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ చక్కర్లు కొడుతున్నాయి.











