టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నారంటే, తెలుగు హీరోలంతా స్టార్లే అని కామెడీగా చెప్పేయెచ్చు కానీ స్టార్ హీరో అనే పదానికి గౌవరం, అర్ధం చేకూర్చే రీతిన తమ కెరీర్ ని కట్టుకున్న హీరోల తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు.
స్టార్ హీరోకి అసలు సిసలైన నిర్వచనాన్ని ఎవ్వరూ చెప్పలేరు, కానీ ఎక్కువగా ఒప్పుకునే వాదనతోనే అంతా సర్థుకుపోతున్నారు. సులువుగా చెప్పాలంటే స్టార్ రేంజ్ కి వచ్చిన హీరో సినిమాలకి కమర్షియల్ నష్టాలు ఉండవు. అంటే జనాలకి నచ్చకపోయిన హీరో అభిమాన వర్గం చూసినా సరే సినిమా లాభాల్లోకి వచ్చేస్తోంది.
అయిదేళ్ల వరకు చిరంజీవి సినిమాలకి ఈ తరహా మాయ జరిగేది, చిరంజీవి యాక్ట్ చేసే సినిమా స్టోరీలు బాగోకపోయినా బాక్సాఫీస్ మీద కాసులు వర్షం కురుసేది. అందుకే చిరంజీవిని మెగాస్టార్ చేసింది టాలీవుడ్, ఇక చిరంజీవి తరువాత ఆ స్టేటస్ చాలా మంది హీరోలు తీసుకున్నప్పటికీ ఒక్కరూ కూడా కన్సిస్టెంట్ గా కమర్షీయల్ సక్సెస్ కొట్టలేకపోతున్నారు.
దీంతో ఏరియాలు వారిగా విడిపోయి సక్సెస్ లు కొట్టి మెగాస్టార్లు అనిపించుకుందామని కొందరు స్టార్ హీరోలు ట్రై చేస్తున్నారు. ఇండస్ట్రీలోకి నిన్నమొన్ననే వచ్చిన విశ్వక్ సేన్ ఇప్పుడు తన మార్కెట్ హైదరాబాద్ ఏరియాలో బాగుంటే చాలు అని ఫీల్ అవుతున్నాడట, తన దగ్గరకు వచ్చే నిర్మాతలకి కూడా హైదరాబాద్, తెలంగాణ ఏరియాల్లో ఉన్న థియేటర్స్,
ఈ ప్రాంతంలో ఏదైనా సినిమా హిట్ అయితే వచ్చే కలెక్షన్స్ ఆధారంగానే పెట్టుబడి పెట్టమని సూచిస్తున్నట్లుగా సమాచారం. దీంతో విశ్వక్ సేన్ ఇప్పుడు సినిమా జనాలంతా హైదరాబాద్ మెగాస్టార్ అని కామెంట్స్ చేస్తున్నారు.