పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తరువాత చేయబోయే సినిమా పై చాలా సస్పెన్స్ నెలకొంది. నిజానికి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తరువాత క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయాలి. కానీ ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్స్ వర్షాలకి మొత్తం నాశనం అయిపోయాయి. మళ్లీ ముందు వేసిన రేంజ్ లో భారీ సెట్స్ వేయడం కుదరదని నిర్మాత ఏఎమ్ రత్నం, క్రిష్ కు తేల్చి చెప్పినట్లు సమాచారం.
కథను మొత్తం మార్చి బడ్జెట్ కూడా తగ్గించుకోమని తెలిపినట్లుగా సమాచారం. దీంతో క్రిష్ ని పిలిచి కొత్త కథ మొత్తం రెడీ చేసి తనకు నెరేట్ చేయమని పవన్ సూచించాడట.
ఇక క్రిష్ సినిమాతో పాటే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ అయింది. పీఎస్ పీకే 28గా ఈ సినిమాను తెరకెక్కించడానికి హరీశ్ శంకర్ సన్నాహాలు మొదలుపెట్టుకున్నాడు. దీనికి సంబంధించి మొత్తం కథ ఇంకా పూర్తి కావాల్సి ఉంది.
ఇది ఇలా ఉంటే ఇటీవలే వీరిద్దరితో పాటు డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా పవన్ తో సినిమా చేస్తున్నట్లుగా ప్రకటించాడు. పవన్ కి అత్యంత సన్నిహితుడు నిర్మాత రామ్ తళ్లూరి ఈ ప్రాజెక్ట్ కి పెట్టుబడి పెడుతున్నాడు.
నెక్ట్స్ ఏంటి.. పవన్ తేల్చలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూడు సినిమా దర్శక నిర్మాతలును పిలిచి బయటకు విడుదల చేసిన ఎనౌన్స్ మెంట్స్ తో పని లేకుండా వకీల్ సాబ్ పూర్తి చేసుకొని వచ్చే సరికి ఎవ్వరి స్క్రిప్ట్ పూర్తిగా తనకు నచ్చి, ఎవరైతే సెట్స్ తో రెడీగా ఉంటారో వారికి ముందుగా తన డేట్స్ ఇస్తా అని తెలిపాడట. దీంతో ఈ ముగ్గురు దర్శకులు ప్రస్తుతం తమ కథ మీద కసరత్తులు చేస్తున్నారని వినిపిస్తోంది.