బీజేపీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ చెప్పేవన్నీ ప్రగల్భాలేనని… తాను గతంలో చెప్పినట్టే జరుగుతోందని అన్నారు. సీఎం కేసీఆర్ దళితుల సాధికారిత, పల్లె, పట్టణాల ప్రగతిపై సమీక్షలు జరపడంపై ట్విట్టర్ లో మండిపడ్డారు. తెలంగాణలోని గ్రామాలు, పట్టణాలు పర్యటించి, ప్రగతి సాధిస్తానంటూ కేసీఆర్ చెప్పేవన్నీ.. ప్రగల్భాలేనని ఆమె తేల్చి చెప్పారు. గతంలో తాను చెప్పినట్టే సీఎం కేసీఆర్ చేస్తున్నారని, ఆయనను చూస్తుంటే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిని కేవలం మొక్కలతోనే సరిపెట్టేలా కనిపిస్తోందని విజయశాంతి మండిపడ్డారు. దళిత సాధికారత కోసమంటూ అఖిలపక్షం ఏర్పాటు చేశారని, సారుకు ఏడేళ్ళ తర్వాత ఇప్పుడే ప్రతిపక్షాలు ఎందుకు గుర్తుకొచ్చాయని ఆమె నిలదీశారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే..
ఈటల రాజేందర్ కు భూ కబ్జా ఆరోపణలు అంటగట్టి.. ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని విజయశాంతి ఆరోపించారు. కేవలం హుజురాబాద్ ఉపఎన్నికల్లో గెలుపు కోసమే సీఎం ప్రగతులు, సాధికారతల పాట పాడుతున్నారని విజయశాంతి ధ్వజమెత్తారు. ఎన్నికలు దగ్గరకొచ్చినప్పుడు మాత్రమే ఆర్భాటాలు చేసే… ఈ సారు తీరు తెలుసు గనుకే బీజేపీ ఈ అఖిల పక్షాన్ని బహిష్కరించిందని అన్నారు. సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలతో సామూహిక భోజనాలు చేయడం, నిరసనలను ఎదుర్కోవడం తప్ప ఒరిగేదేమీ లేదని రాములమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ.. దేశ ధాన్యాగారంగా మారిందని గొప్పలు చెబుతున్న కేసీఆర్ కు… పంటలకు మంటలు పెట్టుకుంటున్న దుస్థితి కనిపించడం లేదా? అని రాములమ్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Must Read ;- కేసీఆర్ సహపంక్తి భోజనం.. వాంతులు, విరేచనాలతో వాసాలమర్రి గ్రామస్థులు
కేవలం హుజురాబాద్ ఉపఎన్నికల కోసమే సీఎం గారు ఈ ప్రగతులు, సాధికారతల పాట పాడుతున్నారన్నది సుస్పష్టం. ఎన్నికలు దగ్గరకొచ్చినప్పుడు మాత్రమే ఆర్భాటాలు చేసే ఈ సారు తీరు తెలుసు గనుకే బీజేపీ ఈ అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించింది.
— VijayashanthiOfficial (@vijayashanthi_m) June 27, 2021