మీరు సీఎంగా ఉండగా.. మా బ్రతుకులను పణంగా పెట్టం..!
మీరు సీఎంగా ఉండగా.. మా బ్రతుకులను పణంగా పెట్టం అన్నది ఏపీలోని కాంట్రాక్టర్ల మాట! ఎందుకంటే ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై.. వందల కోట్ల అప్పుల్లో కూరుకుపోయారు కాబట్టి!! ఏపి వ్యాప్తంగా కాంట్రాక్టర్లందరూ ఒక్కతాటిపైకి వచ్చి.. పాతఅప్పులను వసూల్ చేసుకునే క్రమంలో రోడ్డెక్కి ఇప్పటికే నిరసన తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో రోడ్లు ఆధ్వానంగా మారాయి. రోడ్లు వెయడానికి ప్రభుత్వం టెండర్లకు పిలుస్తున్నా.. గుత్తేదారులు జగన్ ప్రభుత్వాన్ని నమ్మి.. పనులు చెయ్యడానికి ముందుకు రావాడంలేదు. కనీసం గుంటలు పూడ్చడానికైనా రండి అని టెంటర్లకు ఆహ్వానించిన కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో రోడ్ల పై ప్రజల ప్రయాణం నరక తుల్యంగా మారింది. నాడు – నేడు కింద చేసిన వర్క్స్ కు దాదాపు రూ. 1000 కోట్ల కు సంబంధించిన బిల్లులను కాంట్రక్టర్లుకు ఇంకా చెల్లించలేదు. చెల్లించాల్సిందిగా కాంట్రక్టర్లు రోడ్డెక్కినా.. ప్రభుత్వం ఖజానాలో చిల్లిగవ్వలేదు అని అధికారులు చేతులెత్తాశారు. అంతిమంగా జగన్ రెడ్డి సీఎం గా ఉండగా ప్రభుత్వం తరుఫున సింగిల్ కాంట్రాక్ట్ కూడా చేయకూడాదని గుత్తేదారులు భీష్మించుకున్నారన్నది తేటతెల్లం!
ఇంటగెల్చి.. రచ్చ గెలవాలి.. మరి బందర్ లో ఆ మంత్రో!?
పేరుకే పేర్ని నాని మంత్రి.. కానీ మచిలీపట్నం నియోజకవర్గంలో గుండుసున్న అన్నది విపక్షల విమర్శ! నియోజకవర్గ పరిధిలో బందర్ పోర్ట్ నిర్మాణానికి కాంట్రాక్టర్లు కు నచ్చజెప్పి.. పనులు చేయించలేని పరిస్థతిలో పేర్ని నాని ఉన్నాడని, సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. బందర్ పోర్ట్ నిర్మాణానికి కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావడంలేదు. టెంటర్లు నేటికి నాలుగు సార్లు ఆహ్వానించినా.. బిడ్లు దాఖలు చేయడానికి కాంట్రాక్టర్లు సుముఖంగా లేరు. ఇలా నాలుగు సార్లు అధికారులు టెంటర్లు ఆహ్వానించినప్పటికీ, కాంట్రక్టర్లు మందుకు రావడంలేదు. ఈ రకంగా ఏకంగా నాలుగోవ సారి జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఘోర పరాభవం జరిగింది. అంతేకాక జగన్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం, ఒడిదుడుకుల గురించి అంతర్రాష్ట కాంట్రక్టర్లకు కూడా తెలిసిపోయింది. దీంతో వారు కూడా ఏపిలో జరిగే కాంట్రక్ట్ వర్క్ లు తీసుకునేందుకు ముందుకు రావడంలేదు. కొన్ని సంస్థలను ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ రెడ్డి బ్రతిమిలాడినా ముందుకు రావడంలేదన్న విమర్శలు లేకపోలేదు. ముందస్తు అన్ని గ్యారెంటీలు ఇస్తాం అన్న కాంట్రక్టర్లు అడుగు ముందుకు వేయకపోవడంతో పరిస్థితులంతా తారుమారయ్యాయి. ఈ నేపధ్యంలో జగన్ రెడ్డి హయంలో ఒక్క బందర్ పోర్ట్ నిర్మాణమేకాదు, ఏ ఒక్క రోడ్డు కూడా ఆధునీకరణ అనేది జరగదు అన్నది అక్షర సత్యం!











