ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు కాలంలోనే టాలీవుడ్ లో ఎక్కువగా మల్టీస్టారర్స్ వచ్చేవి. అత్యధిక శాతం సక్సెస్ అయ్యేవి. కానీ ఆ తర్వాత తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు అప్పటికాలంలో ఎందుకోగానీ.. మల్టీస్టారర్స్ లో నటించడానికి అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. అయితే వీరిలో చిరంజీవి, బాలయ్య మాత్రమే తమ కెరీర్ బిగినింగ్ లో వేరు వేరుగా కొన్ని మల్టీస్టారర్స్ లో నటించారు. అలాగే వెంకీ కూడా త్రిమూర్తులు లాంటి మల్టీస్టారర్ లో నటించాడు. కానీ స్టార్ హీరోలైన తర్వాత ఎవరికి వారు మల్టీస్టారర్స్ లో నటించాలనే ఆలోచనే చేయలేదు. నిన్న మొన్నటి వరకూ వారి తీరు అలాగే సాగింది. అయితే గత కొంతకాలంగా.. వెంకీ, నాగార్జున మాత్రం యంగ్ హీరోలతో మల్టీస్టారర్స్ మల్టీస్టారర్స్ లో నటిస్తూ.. ప్రేక్షకులకు డబుల్ ఫీస్ట్ అందిస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాలా గోపాలా, ఎఫ్ 2, మసాలా, వెంకీమామ, దేవదాసు లాంటి మూవీస్ ఆ కోవలో వచ్చిన చిత్రాలే. అఫ్ కోర్స్ .. కథ నచ్చితే … ఎలాంటి యంగ్ హీరో సరసన అయినా సినిమాలు చేసేందుకు ఈ బావా బావ మరుదులిద్దరూ ఏనాడో డిసైడ్ అయ్యారనుకోండి. ఇప్పుడు ఈ జాబితాలోకి కొత్తగా మెగాస్టార్ కూడా వచ్చి చేరబోతున్నట్టు సమాచారం. చిరు తనంతట తానే ఒక యంగ్ హీరోతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి. లాక్ డౌన్ కారణంగా చిత్రీకరణను వాయిదా వేసుకున్న ఈ సినిమా యూనిట్ .. త్వరలోనే బాలెన్స్ పార్ట్ షూట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆ తర్వాత ‘లూసిఫర్’ మలయాళ రీమేక్, ఆపై మెహర్ రమేష్, బాబీ దర్శకత్వంలో కూడా సినిమాలు చేయబోతున్నట్టు చిరు ఆ మధ్య చెప్పారు. అయితే వాటిలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి మాత్రం చిరంజీవి డిఫరెంట్ గా వెళ్ళే ఆలోచన చేస్తున్నారట. లాస్టియర్ వెంకీ, చైతూలతో మామా అల్లుళ్ళ సెంటిమెంట్ తో బాబీ తెరకెక్కించిన ‘వెంకీమామ’ చిత్రం మంచి వసూళ్ళు కురిపించిన నేపథ్యంలో .. తాను కూడా అలాంటి సెంటిమెంట్ తో వేరే యంగ్ హీరోతో ఒక సినిమా చేయాలని ఉందని.. దానికి సంబంధించిన మంచి కథ రెడీ చేయమని బాబీకి చెప్పారట చిరంజీవి . ఇప్పటికే నిర్మాతలు .. ఈ ప్రాజెక్ట్ కోసం మరో హీరోని వెతికే పనిలో ఉన్నారట. అయితే మెగా ఫ్యామిలీ హీరోని తీసుకుంటారా? లేక బైటికి వారికి ప్రాధాన్యతనిస్తారా అన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఇక ఈ ప్రాజెక్ట్ ను మైత్రీ మూవీస్ నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఈ నెల 22న మెగాస్టార్ పుట్టినరోజును పురస్కరించుకొని బాబీ సినిమా అనౌన్స్ మెంట్ జరగవచ్చని ఒక టాక్ వినిపిస్తోంది. మరి చిరంజీవి తో నటించి.. స్టెప్పులేసే ఆ హీరో ఎవరౌతారో చూడాలి.
పుష్ప 2 అప్డేట్స్ ఇవేనా ?
అల్లు అర్జున్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మవవీగా రికార్డు సృష్టించిన...