ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ ను ఏలిన అందాల భామల్లో జయప్రద పేరు ముందు వరుసలో ఉంటుంది. సత్యజిత్ రే లాంటి దిగ్దర్శకుడు ఆమె.. భారతీయ పరిశ్రమకే అందగత్తె అనే కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. 1974 లో ‘భూమి కోసం’ చిత్రం నుంచి నిన్న మొన్నటి ‘శరభ’ సినిమా వరుకూ .. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో దాదాపు 300 చిత్రాలకు పైగానే నటించి మెప్పించారు. ఇక ఆమె నటించిన ‘సువర్ణ సుందరి’ అనే సినిమా విడుదల కావాల్సి ఉంది.
ఇక సినిమాలతో బాటు రాజకీయాల్లోనూ క్రియా శీలంగా వ్యవహరించిన జయప్రద ఇప్పుడు పంజాబీ చిత్ర సీమలో కూడా నటిగా రంగ ప్రవేశం చేయబోతుండడం విశేషం. ఆరు పదుల వయసుకు అతిదగ్గరలోనే ఉన్న జయప్రద అందుకు తగ్గ పాత్రలోనే నటించబోతున్నారు. కె.సి.బొకాడియా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమా పేరు ‘భూత్ అంకుల్ తుస్సీ గ్రేట్ హో’. హారర్ కామెడీగా రూపొందబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలవుతుంది. మరి జయప్రద ఈ సినిమా తో పంజాబీ ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో ఆకట్టుకుంటారో చూడాలి.
Also Read: టాలీవుడ్ గూఢచారికి అరుదైన గౌరవం.. !