ఒకో భాషలోనూ ఆయా హీరోల రేంజ్ ను బట్టి వారికి ప్రేక్షకుల్లో క్రేజీ బిరుదులుండడం సర్వసాధారణం. అయితే వాటిలో ఎక్కువగా వినిపించేవి సూపర్ స్టార్, మెగాస్టార్ లాంటివి. అయితే వీటితో పాటు మరో బిరుదు కూడా కాస్తంత ఎక్కుగానే కొన్ని భాషల్లో సౌండిస్తూ ఉంటుంది. అదే పవర్ స్టార్. టాలీవుడ్ లో పవర్ స్టార్ ఎవరో చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. కోలీవుడ్ లో కూడా ఒక పవర్ స్టారున్నాడు. పేరు శ్రీనివాసన్. అతడొక కమెడియన్. తెలుగు లో సంపూర్ణేష్ బాబు లా అతడి సినిమాలు కూడా ఓవర్ కామెడీతోనూ, వెటకారంతోనూ తెరకెక్కుతుంటాయి.
ఇక శాండిల్ వుడ్ విషయానికొస్తే.. అక్కడ రాజ్ కుమార్ తనయుడు స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కూడా పవర్ స్టార్ నే. కన్నడలో అత్యధికంగా క్రేజ్ కలిగిన హీరోల్లో ఇతడు ఒకడు. బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో మెరిసినా.. పూరీ జగన్నాథ్ ‘అప్పు’ మూవీతో హీరోగా కన్నడ నాట ఎంట్రీ ఇచ్చాడు పునీత్. అదే సినిమా తెలుగులో రవితేజ తో ‘ఇడియట్’ గా రీమేక్ చేశాడు పూరీ. మొదటి సినిమాతోనే కన్నడ నాట మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు పునీత్ రాజ్ కుమార్. ఆ తర్వాత ఎన్నో మూవీస్ తో సత్తా చాటుకున్నాడు. అలాగే అతడు మంచి డ్యాన్సర్ అవడంతో .. అతడి డ్యాన్సులకు కూడా మంచి క్రేజ్ ఉందక్కడ.
పునీత్ రాజ్ కుమార్ లేటెస్ట్ మూవీ ‘యువరత్న’. విజయ్ కిరగండూర్ నిర్మాణంలో సంతోష్ ఆనంద్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సాయేషా సైగల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా విడుదలవుతుండడం విశేషంగా మారింది. పునీత్ రాజ్ కుమార్ ఈ మూవీతోనే తెలుగు లో ఎంట్రీ ఇస్తున్నాడని చెప్పాలి. సాధారణంగా కన్నడ హీరోలు తెలుగు మార్కెట్ మీద అంతగా దృష్టిపెట్టరు. అయితే ఎప్పుడైతే కేజీఎఫ్ సినిమా తెలుగులో కూడా మ్యాజిక్ చేసిందో అప్పటినుంచి తెలుగు ఇండస్ట్రీ మీద వారి కన్ను పడింది. అందులో భాగంగానే ఇప్పుడు యువరత్న సినిమాను కన్నడ తో పాటు .. తెలుగులో కూడా విడుదల చేస్తుండడం విశేషంగా మారింది. మరి ఈ సినిమాతో పునీత్ రాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.
Must Read ;- ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ గా కన్నడ కస్తూరి