సూపర్ స్టార్ కృష్ణ నటించిన కుటుంబ కథాచిత్రాల్లో చాలా ప్రత్యేకమైనది ‘బండోడు గుండమ్మ’ . విజయలక్ష్మీ మూవీస్ బ్యానర్ పై , జి.వి.జి రాజు నిర్మాణంలో దాసరినారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కి ఈ సినిమా 1980, అక్టోబర్ 3న విడుదలైంది. సరిగ్గా నేటికి 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది ఈ సినిమా. జయప్రద కథానాయికగా నటించిన ఈ సినిమా లో ఇంకా ప్రభ, జ్యోతిలక్ష్మి, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, భావన నిర్మల తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
చక్రవర్తి సంగీత సారధ్యంలోని పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పువ్వులా పొడిచిందొక చుక్కమ్మ, ఊరు నిదరపోతోంది.. గాలి నిదరపోతోంది పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి. కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా వినోద ప్రధానంగా సాగుతుంది. అమాయకుడైన బండోడు .. గుండమ్మ జయప్రద ని ప్రేమించే సన్నేవేశాలు, కుర్రగ్యాంగ్ తో ఆయన చేసే అల్లరి నాటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. అలాగే.. క్రిమినల్ అయిన మరో కృష్ణ, బండోడు కలుసుకొనే సన్నివేశాలు కూడా మెప్పిస్తాయి. అప్పట్లో ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది.