అధికారం పోయినా వైసీపీ నేతల రక్తదాహం చల్లారడం లేదు. గుంటూరు జిల్లాలో జనసేన నేత శ్రీనివాస్ యాదవ్‌ను చం*పేందుకు వైసీపీ నేత నరేంద్ర రెడ్డి ఏకంగా కోటిన్నర రూపాయలకు ఓ రౌడీషీటర్‌కు కాంట్రాక్టు ఇచ్చిన విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. సోమవారం ఉదయం శ్రీనివాస్ యాదవ్ జిమ్‌కు వెళ్లే సమయంలో ప్రాణాలు తీయాలని పక్కా స్కెచ్ వేశాడు. ఈ కిరాతక గ్యాంగ్ తో ఇప్పటికే రెండుసార్లు రెక్కీ కూడా చేయించాడు. ఇది ఏపీలో వైసీపీ పెంచి పోషించిన హ*త్యా రాజకీయాల తెగింపుకు నిలువెత్తు నిదర్శనం.
ఈ హ*త్య కుట్ర వెనుక ఉన్న కారణం చూస్తే వైసీపీ నేతల ఫ్యాక్షన్ రాజకీయం ఏంటో ఇట్టే అర్థమవుతుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నరేంద్రరెడ్డి చేసిన అరాచకాలు, సాగించిన దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు. ఆ ఆగడాలను జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ధైర్యంగా అడ్డుకున్నాడు. తన అక్రమాలను ప్రశ్నిస్తున్నాడన్న కక్షతో, అతన్ని శాశ్వతంగా అడ్డుతొలగించుకోవాలని నరేంద్ర రెడ్డి ఈ కోటిన్నర సుపారీకి తెరలేపాడు. ప్రశ్నించే గొంతును నొక్కేసేందుకు ఏకంగా ప్రాణాలు తీయడానికైనా వెనుకాడని వైసీపీ నేతల అహంకారానికి ఇది పరాకాష్ట.
నరేంద్రరెడ్డికి ఇలా దౌర్జన్యాలు చేయడం, చట్టాన్ని బూటు కాలి కింద తొక్కిపెట్టడం కొత్తేమీ కాదు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున ఏకంగా పెమ్మసాని చంద్రశేఖర్‌పైనే దా*డికి తెగబడ్డాడు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లోనూ రౌడీయిజం చెలాయించిన ట్రాక్ రికార్డ్ అతనిది. ఆ రోజు దా*డితో మొదలైన అతని అహంకారం, ఈరోజు ఓ ప్రత్యర్థి నాయకుడి ప్రాణాలు తీసే స్థాయికి బరితెగించింది. ప్రజలు ఛీకొట్టి ఓడించినా ఏమాత్రం మార్పు రాని ఇలాంటి నేతల తీరు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తోంది.
అయితే, నరేంద్ర రెడ్డి స్కెచ్ ఎంత పక్కాగా ఉన్నా.. పోలీసుల ఎంట్రీతో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. శ్రీనివాస్ యాదవ్‌ను చం*పేందుకు పన్నిన పన్నాగం బట్టబయలు కావడంతో, నరేంద్రరెడ్డి ఇప్పుడు తోక ముడిచాడు. పోలీసులు కేసు నమోదు చేయగానే భయంతో పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న నరేంద్ర రెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.











