ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్నూల్ పాలకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసుల కట్టడికి పాక్షిక లాక్ డౌన్ అమలు చేయనున్నారు. ఈ మేరకు కర్నూల్ మేయర్ రామయ్య అధికారులతో సమావేశమయ్యారు. ప్రజల ఆరోగ్యం కోసం పాక్షిక లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో సోమవారం నుంచి కర్నూల్ వ్యాపారసముదాలు, దుకాణాలు, ఇతర సంస్థలు మూతపడనున్నాయి. నేటి నుంచి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే వ్యాపార కార్యకలాపాలు జరగనున్నాయి. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాలని, ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి షాపుల ముందు శానిటైజర్ బాటిళ్లను అందుబాటులో ఉంచాలని మేయర్ సూచించారు.











