ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వచ్చిన ఒకేఒక్కడు సినిమా గుర్తుందా! అందులో హీరో అర్జున్.. విలన్ చాలెంజ్ ను అంగీకరించి.. ఒక్కరోజు సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తాడు. ఆ ఒక్కరోజులోనే తన పాలనతో ప్రజలను మెప్పిస్తాడు. రాజకీయాలనే సమూలంగా మార్చేస్తాడు. ఆ తర్వాత ఎన్నికల్లో నెగ్గి పూర్తా స్థాయి సీఎంగా మారతాడు. ఇదంతా.. సినిమా! ఈ విషయం అలా పక్కన పెడితే.. సరిగ్గా.. ఇలాంటి ఘటనే ఇప్పుడు ఉత్తరాఖండ్ లో జరగబోతోంది. కాకపోతే.. ఒక చిన్న మార్పు. అక్కడ ఒకేఒక్కడు అర్జున్ అయితే.. ఇక్కడ సృష్టి గోస్వామి అనే ఓ యువతి.
Must Read ;- దేశంలోనే పిన్నవయస్కురాలైన మేయర్ ‘ఆర్యా రాజేంద్రన్’
జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా..
జనవరి 24.. జాతీయ బాలికా దినోత్సవం. ఈ సందర్భంగా.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ ఒక్కరోజుకీ బాలికల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఓ వ్యక్తిని సీఎం చేయాలని సంకల్పించింది. అనుకున్నదే తడవుగా ఆచరణలోకి తెచ్చేసింది. ఇందుకు గాను సృష్టి గోస్వామిని ఎంపిక చేసింది. ఆదివారం ఆమె ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేస్తోంది.
Also Read ;- పాకిస్తాన్‌లో పుట్టిన ‘సుప్రీం’ కమిటీ సభ్యుడు.. రైతు సమ్మె పరిష్కారానికి సారధి
ఎవరీ సృష్టి గోస్వామి?
అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న సృష్టి గోస్వామి.. దౌలాత్పూర్ గ్రామంలో నివసిస్తోంది. ఆమె తండ్రి అదే గ్రామంలో ఓ చిన్న దుకాణం నిర్వహస్తుండగా.. తల్లి అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తోంది. ఆ రాష్ట్రంలో బాలికాభ్యున్నతికి కృషి చేస్తున్న సృష్టి గోస్వామి.. 2018లో ఉత్తరాఖండ్ చైల్డ్ అసెంబ్లీకి లా మేకర్ గా ఎంపికయ్యారు. 2019లో అంతర్జాతీయ బాలికా సదస్సులో పాల్గొనేందుకు థాయ్ ల్యాండ్ వెళ్లారు. దీనిపై సృష్టి తండ్రి మాట్లాడుతూ.. ‘‘సృష్టి చాలా తెలివైన అమ్మాయి. ఆమె బాలికా విద్యను ప్రోత్సహస్తూ.. వారి ఉన్నతికి కృషి చేస్తోంది. ఇందుకు గాను ఆమె ఓ స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతోంది. ఇప్పుడు ఈ స్థాయికి చేరడం మాకు ఎంతో గర్వంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు.
Also Read ;- స్లమ్ ‘బ్యూటీ’.. మలీశా కర్వా;..