ప్రస్తుతం టాలీవుడ్ మేకర్స్ .. కొరియన్ మూవీస్ మీద పడ్డారు. ఆ సినిమాల్ని ఇదివరకటిలా సీన్ టు సీన్ లేపేయకుండా.. రైట్స్ కొని మరీ రీమేక్ చేస్తున్నారు. అలాంటి ఓ కొరియన్ మూవీ ఓ బేబీగా రీమేక్ అయి మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో కొరియన్ మూవీ రీమేక్ రైట్స్ ను సురేశ్ ప్రొడక్షన్స్ వారు సొంతం చేసుకున్నారు. ఆ కొరియన్ మూవీ పేరు ‘మిడ్ నైట్ రన్నర్స్’. నాలుగేళ్ళ క్రితం సియోల్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టైంది.
త్వరలో ఈ సినిమా తెలుగులో రీమేక్ కాబోతోంది. అయితే ఒరిజినల్ వెర్షన్ లో ప్రధాన పాత్రలు పోషించిన వారు మేల్స్. ఆ ఇద్దరూ కాప్సే. ఇప్పుడు తెలుగు వెర్షన్ ఫిమేల్ ఓరియెంటెడ్ గా ఉండబోతోందన్నమాట. రెజినా కసండ్రా, నివేదా థామస్ లేడీ పోలీసులు గా నటిస్తున్నారు. కిడ్నాప్ నేపథ్యంలో సాగే ఓ థ్రిల్లర్ మూవీ ఇది. అలాంటి ఈ సినిమాకి తెలుగులో ‘శాకినీ ఢాకినీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఒక కిడ్నాపింగ్ కేసు ను అప్పుడే పోలీస్ అకాడెమీలోకి అడుగుపెట్టిన ఇద్దరు ఆడపోలీసులు ఎలా సాల్వ్ చేశారు అనేదే కథాంశం. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రాబోతోంది. శాకినీ ఢాకినీ గా రెజీనా, నివేదా ఎలా అదరగొడతారో చూడాలి.











