మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. క్రేజీ డైరెక్టర్ శంకర్ కాంబో మూవీ త్వరలోనే మొదలు కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ , స్ర్కిప్ట్ వర్క్ నడుస్తుండగా.. నటీనటుల ఎంపిక ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇందులో ఎవరు కథానాయికగా నటిస్తున్నారనే విషయంలో ఇంతవరకూ క్లారిటీ రాలేదు. ఈ మూవీ అనౌన్స్ చేసిన తర్వాత ముందుగా ఇందులో కథానాయికగా కొరియన్ భామ సుజీబే నటిస్తోందంటూ.. వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ పేరు వినిపిస్తోంది.
‘వినయ విధేయ రామ’లో రామ్ చరణ్ , కియారా అద్వానీ తొలి సారిగా టాలీవుడ్ లో జంటగా నటించారు. అంతకు ముందే అమ్మడు మహేశ్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాతో మంచి పేరు తెచ్చుకోవడంతో దర్శకుడు బోయపాటి చెర్రీకి జోడీగా సెట్ చేశాడు. ఆ సినిమా అంతగా ఆడకపోయినప్పటికీ.. శంకర్ చెర్రీ సినిమాకి ఆమెనే మళ్ళీ హీరోయిన్ గా ఫిక్స్ చేశారని టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట. పాన్ ఇండియా కేటగిరిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈసినిమాకి కియారా స్ర్కీన్ ప్రెజెన్స్ ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
Must Read : శంకర్ – చరణ్ మూవీలో విలన్ గా స్టార్ హీరో!