ఏపీ పోలీసులు ముమ్మాటికీ బరితెగింపునకే పాల్పడ్డారు. ఎమ్మెల్సీ పదవిలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిపై ఏకంగా మ్యాన్ హ్యాండ్లింగ్ కే పాల్పడ్డారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ప్రేమోన్మాది దాడిలో చనిపోయిన విద్యార్థిని అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరిన నారా లోకేశ్ ను గన్నవరం ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ తర్వాత ఆయనను కారులో ఎక్కింది.. ఆ కారును తమ స్వాధీనంలోకి తీసుకుని ఏలూరు-విజయవాడ రహదారిపై చక్కర్లు కొట్టించారు. ఆ తర్వాత ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి లోకేశ్ ను తరలించే యత్నం చేసిన పోలీసులు.. కనకదుర్గ వారధి పరిధిలోని వై జంక్షన్ లో కారును నిలిపేశారు. ఈ సందర్భంగా హైడ్రామా చోటుచేసుకోగా.. లోకేశ్ ను కారులో నుంచి కిందకు లాగేసే యత్నం చేసిన పోలీసులు ఆయనపై చేయి వేశారు.
ముఖంపైనా చేతులేశారే
ఈ క్రమంలో విజయవాడ నగర పరిధిలో డీసీపీగా పనిచేస్తున్న ఓ పోలీసు అధికారి లోకేశ్ పట్ల అనుచితంగా వ్యవహరించారు. కారులో నుంచి దిగేందుకు లోకేశ్ నిరాకరించిన సందర్భంగా.. లోకేశ్ చేయి పట్టి బయటకు లాగే యత్నం చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ ను ఓ భుజంపై మరో అధికారి కొట్టినంత పనిచేయడంతో.. లోకేశ్ షాక్ నకు గురయ్యారు. అయితే అంతలోనే తేరుకున్న లోకేశ్ తన భుజాన్ని రెప్పపాటులో కారు లోపలికి లాగేసుకున్నారు. ఆ తర్వాత కూడా లోకేశ్ పై డీసీపీ చేతులేశారు. లోకేశ్ చేయి పట్టుకుని బలవంతంగా కిందకు లాగే యత్నం చేస్తూనే.. లోకేశ్ ముఖంపైనా చేతులేమయబోయారు. ముఖానికి ఉన్న మాస్కును కూడా లాగేసే యత్నం చేశారు. డీసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్.. తన ముఖాన్ని పక్కకు తిప్పుకుని మాస్కు జారకుండా జాగ్రత్త పడ్డారు. ఈ సందర్భంగానూ పోలీసులతో లోకేశ్ తీవ్ర స్థాయిలోనే వాగ్వాదం చేశారు.
నోటీసుల కోసం లోకేశ్ పట్టు
ఈ క్రమంలోనే విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు తరలిరావడంతో పోలీసులు వెనక్కు తగ్గారు. ఉండవల్లిలోని ఇంటికి వెళ్లిపోవాలని లోకేశ్ ను ఆదేశించారు. ఇంత జరిగాక కూడా.. తాను వెనక్కు వెళ్లేది లేదని, తనను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో కారణం చెప్పడంతో పాటు తనను అదుపులోకి తీసుకున్న వైనంపై నోటీసులు ఇచ్చేదాకా అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చేశారు. అయితే నోటీసులు ఇవ్వడానికొ తొలుత పోలీసులు నిరాకరించినా.. ఆ తర్వాత నోటీసులు ఇచ్చి లోకేశ్ తో సంతకం పెట్టించుకున్నారు. పోలీసులు నోటీసులు ఇవ్వడంతో శాంతించిన లోకేశ్.. ఆ తర్వాత ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో లోకేశ్ పై మ్యాన్ హ్యాండ్లింగ్ కు పాల్పడిన తీరు వివాదాస్పమైంది.
Must Read ;- అత్యాచారాంధ్రగా ఏపీ.. గుంటూరులో మరో దారుణం











